4జిబి ర్యామ్‌తో లీకో ఫోన్, ధర తక్కువే

Written By:

చైనా దిగ్గజం లీకో గత ఏడాది సెప్టెంబర్ లో LeEco Le Pro 3ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ఊపులో LeEco Le Pro 3 Eliteని చైనాలో లాంచ్ చేసింది. చైనా కరెన్సీలో దీని ధర CNY 1,699. మన ఇండియాకి వచ్చేసరికి దీని ధర దాదాపు రూ. 16500 ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన అమ్మకాలు చైనా సైట్ లీకో.కామ్ లో జరుగుతున్నాయి. ఫీచర్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

నమ్మలేని నిజం..జుకర్‌బర్గ్ ఇప్పుడు డిగ్రీ పట్టా పొందారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

ఎన్ఎఫ్సీ సపోర్ట్ తో ఈ మొబైల్ వస్తోంది. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటు 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో మొబైల్ వస్తోంది. 2.5 కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే దీని సొంతం

స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్

క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ తో పాటు అడెర్నో 530 GPUతో ఈ ఫోన్ వస్తోంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది.

4 జీబీ ర్యామ్

4 జీబీ ర్యామ్ తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా విస్తరించుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది.

16 మెగాపిక్సల్ రియర్ కెమెరా

కెమెరా విషయానికొస్తే 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ తో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను కూడా పొందుపరిచారు.

అదనపు అకర్షణలు

4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 4070 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ సపోర్ట్ వంటివి ఫోన్ కి అదనపు అకర్షణలుగా నిలవనున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le Pro 3 Elite Launched: Price, Release Date, Specifications, and More read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot