నమ్మలేని నిజం..జుకర్‌బర్గ్ ఇప్పుడు డిగ్రీ పట్టా పొందారు

Written By:

సోషల్ మీడియా రంగాన్ని ఓ ఊఫు ఊపిన ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ ఇప్పుడు డిగ్రీ పట్టా పొందారు ఏందీ నమ్మలేకున్నారా..ఇది నిజం. హార్వర్డ్ స్కూల్ డ్రాపవుట్‌గా అందరికీ సుపరిచితమైన మార్క్ జుకర్‌బర్గ్ ఎట్లకేలకు డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు. మే నెలలో జరుగబోతున్న హార్వర్డ్స్ అప్ కమింగ్ గ్రాడ్యుయేషన్ సెర్మినీలో జుకర్ బర్గ్ ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు.

ఆధార్ పే లాంచ్ అయింది, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!

నమ్మలేని నిజం..జుకర్‌బర్గ్ ఇప్పుడు డిగ్రీ పట్టా పొందారు

ప్రారంభోత్సవ ప్రసంగానికి వస్తున్న మార్క్ జుకర్‌బర్గ్ కు గౌరవ డిగ్రీ పట్టా అందించాలని యూనివర్సిటీ నిర్ణయించింది.ఫేస్‌బుక్‌ను స్థాపించిన మార్క్ జుకర్‌బర్గ్, డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న సమయంలోనే అంటే 2004లోనే హార్వర్డ్ స్కూల్ నుంచి బయటికి వచ్చేశారు. తన పూర్తికాల సమయాన్ని ఫేస్‌బుక్ పైనే వెచ్చించి దాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

మెసేంజర్‌లో దిస్ లైక్ బటన్ వస్తోంది

నమ్మలేని నిజం..జుకర్‌బర్గ్ ఇప్పుడు డిగ్రీ పట్టా పొందారు

ఫేస్‌బుక్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ యూజర్లున్నారు. ఇటీవల కాలంలో ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్న అతిపిన్న వయస్కుడిగా మార్క్ జుకర్ వర్క్ గుర్తింపులోకి రానున్నారని హార్వర్డ్ డైలీ స్టూడెంట్ న్యూస్ పేపర్ ది హార్వర్డ్ క్రిమ్సన్ నోట్స్‌లో తెలిపింది.

వాట్సప్‌లో మరో పవర్‌పుల్ ఫీచర్ !

నమ్మలేని నిజం..జుకర్‌బర్గ్ ఇప్పుడు డిగ్రీ పట్టా పొందారు

హార్వర్డ్ స్కూల్ రెండు విధాలుగా హార్వర్డ్ డిగ్రీని సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకటి రెగ్యులర్‌గా క్లాసులకు వెళ్లి డిగ్రీ సంపాదించడం, మరొకటి ప్రపంచ రూపురేఖలనే మార్చే కంపెనీని ఏర్పాటు చేయడం.

English summary
Harvard dropout Mark Zuckerberg to get his degree after 12 years read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot