రికార్డులు బద్దలు కొడుతున్న దూకుడు బ్రాండ్...!!

Posted By: Staff

రికార్డులు బద్దలు కొడుతున్న దూకుడు బ్రాండ్...!!

 

స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్న ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ ఉత్పాదక సంస్ధ ‘ఎల్‌జీ’ తన ఖాతాలో మరో రికార్డును జమ చేసుకుంది. ఈ రంగంలో ప్రత్యర్థి బ్రాండ్‌లైన శామ్‌సంగ్, హెచ్‌టీసీలకు ఎల్‌జీ గట్టి పోటీనిస్తుంది.

పోటీ మార్కెట్‌ను సవాల్‌గా తీసుకుని 4జీ నెట్‌వర్క్ విశిష్టతతో ఎల్‌జీ రూపొందించిన ‘ఆప్టిమస్ ఎల్‌టీ‌ఈ స్మార్ట్ ఫోన్’అమ్మకాల విషయంలో రికార్డు నెలకొల్పింది. ఎంపిక చేసిన దేశాల్లో అక్టోబర్‌లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ మూడు నెలల వ్యవధిలో 10 లక్షల యూనిట్‌ల అమ్ముడైనట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. వీటిలో 6 లక్షల యూనిట్లు సౌత్ కొరియాలో అమ్ముడువటం విశేషం.

‘ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌టీ‌ఈ స్మార్ట్ ఫోన్’ ముఖ్య ఫీచర్లు:

* ఏహెచ్- ఐపీఎస్ టెక్నాలజీ సామర్ధ్యం గల 4.5 అంగుళాల డిస్‌ప్లే, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * 1జీబి ర్యామ్, * 4జీబి ఇంటర్నల్ మెమెరీ, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ , డీఎమ్‌బీ సపోర్ట్, * శక్తివంతమైన బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot