మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో ఎల్‌జి కొత్త ఆవిష్కరణలు

By Sivanjaneyulu
|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జి (LG) మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014, మొదటి రోజు ప్రదర్శనలో భాగంగా సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే...

 
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో ఎల్‌జి కొత్త ఆవిష్కరణలు

ఎల్‌జి జీ ప్రో 2 (LG G Pro 2):

ఎల్‌జి జీ ప్రో వర్షన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ప్రదర్శింపబడిన ఈ హ్యాండ్‌సెట్ 5.9 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 సాక్ శక్తితోకూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి), 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్+ ఫీచర్‌తో).

ఎల్‌జి 2 మినీ (LG G2 mini):

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్), రెండు హార్డ్‌వేర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. (1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ క్వాడ్-కోర్ ఎమ్ఎస్ఎమ్8926 ఎల్ఈటీ/3జీ, 1.7గిగాహెట్జ్ ఎన్-విడియా క్వాడ్‌కోర్ టెగ్రా 4ఐ (ఎల్టీఈ వర్షన్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (క్వాల్కమ్ క్వాడ్-కోర్ వర్షన్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎన్-విడియా క్వాడ్‌కోర్ వర్షన్), ఆటో ఫోకస్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ వంటి సౌకర్యాలను ఈ కెమెరాలు కలిగి ఉన్నాయి. 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2440ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో ఎల్‌జి కొత్త ఆవిష్కరణలు

ఎల్‌జి ఎల్ సిరీస్ III బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు (LG L series III budget smartphones):

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఎల్‌జి తన ఎల్ సిరీస్ నుంచి మూడు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. ఎల్90 (4.7 అంగుళాల తాకే తెర), ఎల్70 (4.5 అంగుళాల తాకే తెర), ఎల్40 (3.5 అంగుళాల తాకే తెర). ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయి. డ్యుయల్ కోర్ చిప్‌సెట్‌లను ఈ డివైస్‌లలో అమర్చారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X