నోకియా నుంచి మరో సంచలనం,రికార్డుల మోతేనా..

Written By:

ఫిబ్రవరి 26 న జగరనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో HMD Global నుంచి మరో నోకియా స్మార్ట్‌ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా వచ్చిన రూమర్ల ప్రకారం నోకియా నుంచి లీకయిన కాన్సెప్ట్ ఫోన్ నోకియా 8గా తెలుస్తోంది. గత నెలలో ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన చిత్రాలు లీకయ్యాయి. ఇప్పటికే నోకియా 6 తో సంచలనం సృష్టించిన కంపెనీ నోకియా 8తో మరో ప్రభంజనాన్ని సృష్టించేలా ఉంది. లీకయిన నోకియా 8 ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో చాట్ ద్వారా డబ్బులు ట్రాన్సఫర్ చేసుకోండిక..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర్యామ్

రానున్న నోకియా 8 ఫోన్ 6 జిబి ర్యామ్ తో పాటు 126 జిబి ఇంటర్నల్ మెమొరీతో రానున్నట్లు తెలుస్తోంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 24 మెగా ఫిక్సల్ విత్ ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ తో అదిరిపోయే విధంగా ఫోటొలు తీసుకోవచ్చు. సెల్పీ కెమెరా విషయానికొస్తే 12 ఎంపీ సెల్పీ కెమెరాను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.

డ్యూయెల్ స్పీకర్లను

ఫ్రంట్ విభాగంలో డ్యూయెల్ స్పీకర్లను పొందుపరిచారు. 3.5 ఎమ్ ఎమ్ ఆడియో జాక్ తో పాటు యుఎస్ బి టైప్ సీ పోర్ట్ ని పొందుపరిచారు.

డిస్ ప్లే

డిస్ ప్లే విషయానికొస్తే 5.7 ఇంచ్ క్వాడ్ HD 1440p తో రానుంది. ప్రాసెసర్ విషయానికొస్తే స్నాప్ డ్రాగన్ 835. మొబైల్ చూసేందుకు చాలా ధిన్ గా ఉంటుందని లీకయిన ఇమేజ్ లని బట్టి తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద ఆపరేట్ అవుతుంది. 

ధర

దీని ధర ఎంతనేది తెలియదు. రూ. 33, 990 ఉంటుందని. అంచనా.బ్యాటరీ విషయానికొస్తే Li-Ion 3,300 mAh battery.4G, Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.0, GPS, NFC, and a microUSB Type-C 3.1 port అదనపు ఫీచర్లు. 

ప్రకటన కోసం ఎదురుచూపులు

ఫాస్ట్ చార్జింగ్ దీని సొంతం.మార్చి 31న దీన్ని లాంచ్ చేసే అవకాశముందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అయితే దీనిపై HMD Global కంపెనీ అఫిషియల్ గా ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. అందరూ నోకియా 8పై ఎప్పుడు ప్రకటన వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

వీడియో

నోకియా 8 ఫోన్ కి సంబంధించి లీకయిన వీడియో ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోర్స్ 

English summary
This Nokia 8 concept video looks stunning read more a gizbo telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot