జియో చాట్ ద్వారా డబ్బులు ట్రాన్సఫర్ చేసుకోండిక..

Written By:

రిలయన్స్ జియో తాజాగా సరికొత్త సర్వీసుని వినియోగదారులకు అందించింది. రిలయన్స్ జియో మనీ వ్యాలెట్‌ని జియో చాట్‌కి కనెక్ట్ చేసి యూజర్లు డబ్బులు పంపిచుకునేలా కొత్త సర్వీసుని అందుబాటులోకి తీసుకొచ్చింది. రిలయన్స్ జియో సిమ్ లు వాడుతున్న వారు ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చని జియో చెబుతోంది. మరి ఎలా పంపాలో అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌కు మరో ముప్పు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో మనీ అకౌంట్ లోకి

మీరు ముందుగా జియో మనీ అకౌంట్ లోకి వెళితే అక్కడ పేమెంట్స్ విభాగం ఉంటుంది. ఆ విభాగంలో మోర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి లింక్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఓ ఓటీపీ వస్తుంది. అది రాగానే మీ జియో మనీకి అకౌంట్ జియో చాట్ తో కనెక్ట్ అవుతుంది.

జియో చాట్ ద్వారా..

ఇప్పుడు మనీ ఎలా పంపాలంటే జియో చాట్ ద్వారా ఇతరులతో చాట్ చేసే సమయంలో ఆ చాట్ లో మీకు రూపీ అనే ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అవతలి వారికి మనీ పంపుకోవచ్చు.

మీ వ్యాలెట్ లో తగినంత బ్యాలన్స్

అయితే మీ వ్యాలెట్ లో తగినంత బ్యాలన్స్ ఉండాలి. అంటే మీరు ఎంత పంపాలనుకుంటున్నారో అంత బ్యాలన్స్ ఉంటేనే అది అవతలి వారికి చేరుతుంది.

జియో మనీ సర్వీస్ వాడుతున్న వారు మాత్రమే

దీంతో పాటు జియో మనీ సర్వీస్ వాడుతున్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీరు మనీ పంపాలంటే అవతలి వారికి కూడా జియో చాట్ ఉండాలి.

గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్

ఇప్పటికే చాలామంది జియో సిమ్‌లు వాడుతున్న నేపథ్యంలో అందరూ జియో చాట్ డౌన్‌లోడ్ చేసుకుని ఉంటారు. లేకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని జియో సర్వీసుని ఆస్వాదించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Now Lets You Transfer Money To Friends Using Jio Chat App read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot