నోకియా P1 ధర ఎంతో తెలిస్తే షాకే !

Written By:

మూడు సంవత్సరాల తరువాత ఆండ్రాయిడ్ ఫ్లాట ఫాం మీద తన తొలి ఫోన్ నోకియా 6ను నోకియా కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. , HMD Globalతో కలిసి నోకియా ఈ ఏడాది చాలా ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నోకియా 6 తరువాత రానున్న ఫోన్ నోకియా పీ1ను MWC 2017లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కి సంబంధించిన ధర ఇప్పుడు ఆన్‌లైన్ లో హల్ చల్ చేస్తోంది.

టెలికం రంగంలో 20 లక్షల ఉద్యోగాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 54,500

నోకియా పీ1 128 జిబి వేరియంట్ ధర సుమారు $800 డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 54,500 గా ఉంటుందని తెలుస్తోంది. అదే 256 జిబి వేరియంట్ ధర రూ. 64,700గా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు రష్యన్ పబ్లికేషన్ తన సైట్లో పొందుపరిచింది.

5.3 ఇంచ్ డిస్ ప్లే

5.3 ఇంచ్ డిస్ ప్లేతో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం. Snapdragon 835 SoCతో పాటు పుల్ హెచ్ డి లేదా QHDస్క్రీన్ రిజల్యూషన్ ఉండే అవకాశం ఉంది.

6 జిబి ర్యామ్

6 జిబి ర్యామ్ తో 128 జిబి ,256 జిబి ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్ బయటకు రానున్నట్లు కధనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న జరగనున్న MWC 2017లో ఈ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

22.6 మెగా ఫిక్సల్ కెమెరా

కెమెరా విషయానికొస్తే 22.6 మెగా ఫిక్సల్ కెమెరాతో రానున్నట్లు రిపోర్టులను బట్టి తెలుస్తోంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. నోకియా పీ1 IP57 సర్టిఫైడ్ ని కూడా కలిగి ఉందట.

3500mAh బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3500mAh బ్యాటరీ. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ . అలాగే ఫింగర్ ఫ్రింట్ స్కానర్ లాంటి ప్రత్యేక ఫీచర్లతో ఫోన్ వస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి.

1 మిలియన్ కు పైగానే రిజిస్ట్రేషన్లు

ఇప్పుడు నోకియా ఫోన్లను తయారుచేయడంకాని డిస్ట్రిబ్యూట్ చేయడం గాని HMD Globalకే లైసెన్స్ ఉంది. కంపెనీ ఫిబ్రవరి 26న జరగనున్న MWC 2017లో మరిన్ని నోకియా ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇక నోకియా 6 ఫోన్ చైనాలో దుమ్మురేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ ప్లాష్ సేల్ లో దాదాపు 1 మిలియన్ కు పైగానే రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia P1 Flagship Android Phone's Price Leaked; Rumoured to Be Launched at MWC 2017 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot