టెలికం రంగంలో 20 లక్షల ఉద్యోగాలు

Written By:

ఈ ఏడాది టెలికం రంగంలో 20 లక్షల ఉద్యోగాలు రెడీ కానున్నాయి. నిరుద్యోగులకు ఇది సరైన అవకాశం. నైపుణ్యాలు నేర్చుకుంటే టెలికంరంగంలో జాబ్ కొట్టేయవచ్చు. దీనికి సంబంధించి రిపోర్టును టెలికాం రంగ నైపుణ్య మండలి (టీఎస్‌ఎస్‌సీ)తో కలిసి ఈ నివేదికను కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ విడుదల చేసింది. అందుబాటు ధరలో డేటా, స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తుండటం, నెట్‌వర్క్‌ మెరుగుకు టెలికాం సంస్థలు అధికంగా పెట్టుబడులు పెడుతుండటం, మొబైల్‌ బ్యాంకింగ్‌, వాలెట్ల వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగాలకు ప్రధాన కారణమని తెలిపింది.

కోటి మంది పెట్టుకున్న పాస్‌వర్డ్ ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

17.60 లక్షల మంది

మొబైల్‌ తయారీ సంస్థలకు 17.60 లక్షల మంది, టెలికాం ఆపరేటర్లకు 3.70 లక్షల మంది ఉద్యోగుల అవసరమున్నట్లు సంస్థ పేర్కొంది.

భారీ స్థాయిలో ఉపాధి కల్పన

5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుందని నివేదిక వెల్లడించింది.

2020-21 నాటికి 9.20 లక్షల ఉద్యోగాలు

ఈ విభాగంలో 2020-21 నాటికి 9.20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. 2021 నాటికి మొత్తం టెలికాం రంగంలో 87 లక్షల మందికి పైగా కార్మికుల అవసరం ఉంటుందని అంచనా వేసింది.

నైపుణ్యాలు కలిగిన సిబ్బంది అవసరం

ఐఒటి, మొబిలిటీ సొల్యూషన్స్‌, టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్స్‌, సేల్స్‌ తదితర విభాగాల్లో నైపుణ్యాలు కలిగిన సిబ్బంది అవసరం ఉందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నీతి శర్ చెప్పారు.

ఈ ఏడాదిలో డిమాండ్‌ అధికం

నెట్‌వర్క్‌ ఇంజనీర్లు, ఇన్‌ఫ్రా, సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌, అప్లికేషన్‌ డెవలపర్స్‌, సిస్టమ్‌ ఇంజనీర్లు, ఐ-డాస్‌ ఇంజనీర్లు, ఇన్‌ షాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌, హ్యాండ్‌సెట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, టెక్నీషియన్లు, కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ టెక్నీషియన్లు, బ్యాక్‌ ఆఫీస్‌ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, రిపేర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటివారికి ఈ ఏడాదిలో డిమాండ్‌ అధికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telecom sector to create 2 million jobs in 2017: Report read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot