అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా వన్‌ప్లస్ 3టీ

Written By:
చాలా రోజుల తర్వాత మళ్లీ వన్‌ప్లస్ 3టీ మార్కెట్లోకి వచ్చేసింది. 128 జిబి వేరియంట్‌ను అమెజాన్ ప్రైమ్ యూజర్స్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. అయితే సాధారణ కష్టమర్లు మరో వారం వరకు ఎదురుచూడక తప్పదని కంపెనీ తెలిపింది. ఈ రోజు 10 గంటల నుండి అమొజాన్ లో వన్‌ప్లస్ 3టీ 128 జిబి వేరియంట్ అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కాగా దీని ధర రూ. 34,999గా ఉంది. గన్‌మెటల్ కలర్‌లో మాత్రమే ఫోన్ లభ్యమవుతోంది. రేపు 10 గంటల వరకు ఈ అమ్మకాలు కొనసాగుతాయి. ఆ తర్వాత వారం రోజుల వరకు ఈ ఫోన్ కనపడదు. మళ్లీ 25 వ తేదీన అమొజాన్ లో ఓపెన్ సేల్ కింద దర్శనమిస్తుంది.
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేగవంతమైన ప్రాసెసర్..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో వస్తోంది. OnePlus 3 ఫోన్ తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా 6జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.

ఎక్కువ స్టోరేజ్..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటికి 64జీబి వర్షన్, రెండవది 128జీబి వర్షన్. గన్ మెటల్, గ్రాఫైట్ ఇంకా సోఫ్ట్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది.

శక్తివంతమైన బ్యాటరీ..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో OnePlus 3 ఫోన్ కేవలం 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది.

కెమెరా ఫీచర్స్..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్, రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

స్ర్కీన్ ఇంకా బాడీ..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. 5.5 అంగుళాల 1.080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ఆపరేటింగ్ సిస్టం..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారండా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశముంది. 

కనెక్టువిటీ ఫీచర్లు

ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 3T 128GB Variant on Sale Exclusively for Amazon India Prime Members Today read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot