భారత్‌లో 30 కోట్లకు చేరిన స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య

2016లో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కేవలం 3% వృద్ధిని మాత్రమే నమోదు చేయగా, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాత్రం 18% వృద్ధిని కనబర్చినట్లు కౌంటర్ పాయింట్ రిసెర్చ్ పేర్కొంది.

|

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య 300 మిలియన్ మార్కును అధిగమించినట్లు కౌంటర్ పాయింట్ రిసెర్చ్ వెల్లడించింది. 2016లో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కేవలం 3% వృద్ధిని మాత్రమే నమోదు చేయగా, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మాత్రం 18% వృద్ధిని కనబర్చినట్లు ఈ రిసెర్చ్ పేర్కొంది.

 46శాతం మార్కెట్ వాటాతో చైనా బ్రాండ్స్ దూకుడు..

46శాతం మార్కెట్ వాటాతో చైనా బ్రాండ్స్ దూకుడు..

భారత్ మార్కెట్లో ఆది నుంచి పట్టు సాధిస్తూ వస్తోన్న చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు 2016, 4వ త్రైమాసికంలో ఏకంగా 46శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్న్లట్లు కౌంటర్ పాయింట్ తెలిపింది.

పండుగల సీజన్‌లో లెనోవో, షియోమీ దూకుడు

పండుగల సీజన్‌లో లెనోవో, షియోమీ దూకుడు

వివో, ఒప్పో, లెనోవో, షియోమీ వంటి చైనా బ్రాండ్‌లు పండుగల సీజన్‌లో దూసుకుపోయినట్లు సదరు రిసెర్చ్ వెల్లడించింది. నోట్ల రద్దు ప్రభావం కూడా చైనా బ్రాండ్‌ల పై అంతగా చూపలేదని రిసెర్చ్ నివేదిక చెబుతోంది.

 రెడ్మీ నోట్ 3 టాప్ ఆన్‌లైన్ బ్రాండ్

రెడ్మీ నోట్ 3 టాప్ ఆన్‌లైన్ బ్రాండ్

ఆన్‌లైన్ వేదికగా 2016లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో రెడ్మీ నోట్ 3 మొదటి ప్లేస్‌లో నిలిచినట్లు ఇటీవల విడుదలైన ఐడీసీ నివేదిక స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

83 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు దేశీయంగా తయారయ్యాయి

83 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు దేశీయంగా తయారయ్యాయి

కౌంటర్ పాయింట్ రిసెర్చ్ వెల్లడించిన వివరాల ప్రకారం 2016లో 83 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు దేశీయంగా తయారయ్యాయి. 2016, 4వ త్రైమాసికంలో అమ్ముడైన ప్రతి 4 స్మార్ట్‌ఫోన్‌లలో 3 భారత్‌లో తయారైనవే కావటం విశేషం.

జియో 4జీ రాకతో...

జియో 4జీ రాకతో...

జియో 4జీ విడుదల తరువాత 4G LTE స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు గణనీయగా పెరిగాయని కౌంటర్ రిసెర్చ్ పేర్కొంది. జియో విడుదల తరవాత మార్కెట్లో అమ్ముడైన ప్రతి 10 స్మార్ట్‌ఫోన్‌లలో 7 ఫోన్‌లు 4G LTE కనెక్టువిటీని కలిగి ఉన్నవేనట. జియోకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకున్న నేపధ్యంలో దాదాపుగా అన్ని 4జీ ఫోన్‌లు జియో ఆఫర్‌‌తో మార్కెట్లో లభ్యమవుతున్నట్లు సదరు రిసెర్చ్ తెలిపింది.

యాపిల్ హవా...

యాపిల్ హవా...

ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి యాపిల్, ఇండియన్ మార్కెట్లో క్యాలెండర్ సంవత్సరానికి గాను 2.5 మిలియన్ యూనిట్లను విక్రయించినట్లు కౌంటర్ రిసెర్చ్ వెల్లడించింది. వాటిలో మూడవ వంతు స్మార్ట్‌ఫోన్‌లు 2016,4వ క్వార్టర్‌లో విక్రయించినవేనట. ఒక్క 4వ క్వార్టర్‌లోనే 8 లక్షల ఫోన్‌లను విక్రయించినట్లు యాపిల్ తెలిపింది.

సామ్‌సంగ్ నెం.1

సామ్‌సంగ్ నెం.1

భారత స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో 25 శాతం మార్కెట్ వాటాతో సామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో మైక్రోమాక్స్, లెనోవో, మోటరోలా, ఇంటెక్స్, రిలయన్స్ జియోలు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Smartphone user base in India crosses 300 million: Counterpoint. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X