ఎదరుచూపులు.. ఎట్టకేలకు బహిర్గతం!!

By Prashanth
|
Sony Xperia P


సోనీ రూపొందించిన సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్‌పీరీయా పీ’ను, నేటి నుంచి ప్రారంభం కానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఫోన్ కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు ఈ ప్రకటనతో ఉత్కంఠకు లోనయ్యారు. ఉత్తమ క్వాలిటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్టీలో ఉత్తమ క్వాలిటీ డిస్‌ప్లే నందించే సోనీ వైట్ మ్యాజిక్ టెక్నాలజీని పొందుపరిచారు. డివైజ్‌లో ప్రస్తుతానికున్న ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌గా వ్ళద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2012 ద్వితియాంకంలో ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది.

భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఎక్స్‌పీరియా పీ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* సుసంపన్నమైన 16 మిలియన్ రంగులతో 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x960 పిక్సల్స్),

* 8మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా (రిసల్యూషన్ 3264x2448పిక్సల్స్, డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్, వీడియో రికార్డింగ్),

* వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఆన్‌లైన్ సర్వీస్ సపోర్ట్,

* ఎఫ్ఎమ్ రేడియో,

* ఇంటర్నల్ మెమెరీ 16జీబి,

* ర్యామ్ 1 జీబి,

* 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్ టిఎమ్ఎల్ బ్రౌజర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X