లీకేజీ భారీన సోనీ కొత్త ఫోన్లు, సరికొత్తగా..

Written By:

ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ ఈవెంట్లో సోనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేద్దామనుకున్న సోని ఎక్స్‌పీరియా హ్యాండ్‌సెట్ ఫోటోలు లీకేజీ భారీన పడ్డాయి. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోలను నెదర్లాండ్స్‌కు చెందిన వెబ్‌సైట్ టెక్‌టాస్టింగ్ రివీల్ చేసింది. ఈ వెబ్‌సైట్ పబ్లిక్ చేసిన కొన్ని ఫోటోలు ఎక్స్‌పీరియా ఎక్స్2విగా టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇమేజస్ కూడా కంపెనీ ఇంతకముందు విడుదల చేసిన ఫోన్ల మాదిరిగానే ఉన్నాయంటున్నారు.

ఐపీఎల్ టార్గెట్‌గా ఇంటెక్స్ సరికొత్త 4జీ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

AnTuTu

చైనా బెంచ్ మార్క్ వెబ్‌సైట్ AnTuTu కూడా సోనీ ఫోన్లకు సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్లో పొందుపరిచింది. దీన్ని వైబో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

4జిబి ర్యామ్

బెంచ్ మార్క్ రిపోర్ట్ ప్రకారం రానున్న సోనీ ఫోన్లు 4జిబి ర్యామ్ తో 64 జిబి ఇంటర్నల్ మెమెరీతో రానున్నాయి. దీంతో పాటు MediaTek Helio P20 processor ఉండనుంది. ఆండ్రాయిడ్ 7.0నౌగట్ మీద ఈ ఫోన్ రన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 24 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫోన్ రానుంది. దీంతో పాటు స్టాండర్డ్ ఓమ్నిబ్యాలెన్స్ డిజైన్‌ను ఇది కలిగి ఉందని సమాచారం. ఇదే డిజైన్‌ను కంపెనీ తన స్మార్ట్‌ఫోన్లకు వాడుతోంది.

ఐదు స్మార్ట్‌ఫోన్లను

ఒక ఫోన్ పెద్ద బెజిల్(డిస్‌ప్లే చుట్టూ ఉండే ఫ్రేమ్)‌ను కలిగిఉంటే, మరొకటి స్లిమ్ బెజిల్‌తో దర్శనమిస్తోంది. ముందస్తు రిపోర్టుల ప్రకారం జపనీస్‌కు చెందిన ఈ దిగ్గజం ఎండబ్ల్యూసీ ఈవెంట్లో కనీసం ఐదు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందని తెలిసింది.

ఫిబ్రవరి 27న సోనీ ప్రెస్ కాన్ఫరెన్స్

అయితే ఏయే మోడల్స్‌ను ఇది విడుదల చేస్తుందో రిపోర్టులు తెలుపలేదు. ఎండబ్ల్యూసీ ఈవెంట్ ప్రారంభ వేడుకలో అంటే ఫిబ్రవరి 27న సోనీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎక్స్‌పీరియా ఎక్స్2 గురించి ప్రకటన వెలువరిస్తే వినియోగదారులకు పండగే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోర్స్ 

English summary
Sony Xperia X2 leaked photos appear before MWC 2017 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot