కొత్త కంపెనీ "Tambo" నుంచి రాబోతున్న మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ "TA-4"

అనేక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఉన్నఈ తరుణంలో "Tambo" అనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ కంపెనీ యాడ్ అయింది.

By Anil
|

అనేక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఉన్నఈ తరుణంలో "Tambo" అనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ కంపెనీ యాడ్ అయింది. కాగా "Tambo" లేటెస్ట్ గా TA-4 అని పిలిచే కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. కొత్త కంపెనీ కాబట్టి మొదటిగా బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ. 6,999 గా కంపెనీ నిర్ణయించింది.ఇతర కంపెనీల బడ్జెట్ ఫోన్స్ లో లభించే అన్ని ఫీచర్స్ ఇందులో లభిస్తాయిని కంపెనీ ప్రకటించింది. ఈ Tambo TA-4 యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

మూడు రంగులలో  అందుబాటులో ఉంటుంది:

మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది:

ఆఫ్ లైన్ స్టోర్స్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ Jet Black, Champagne and Sapphire Blue రంగులలో లభిస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,పేస్ అన్ లాక్ సిస్టం కలిగి ఉంది.

బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్:

బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్:

Tambo TA-4 ఒక రకమైన UNIBODE డిజైన్ తో ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది.స్మార్ట్ఫోన్ యొక్క అన్ని మూలాల బెజ్జెల్లు కలిగి ఉంటుంది,ఫోన్‌కు ఇది ప్రీమియమ్ ఫీల్‌ను తీసుకువచ్చాయి. డిస్‌ప్లే పై అమర్చిన 2.5డి కర్వుడ్ గ్లాస్ ఫోన్ అందాన్ని మరింత పెంచేసింది.ఫోన్ క్రింది భాగంలో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్టును క్రింది భాగంలో పొజీషన్ చేసి ఉంచారు.

డిస్‌ప్లే:
 

డిస్‌ప్లే:

Tambo TA-4 ఫోన్ 5.45 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్క్రీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1440 x 720పిక్సల్స్. డిస్‌ప్లే పై కవర్ చేసిన 2.5డి కర్వుడ్ గ్లాస్ డీసెంట్ లుక్‌ను ఆఫర్ చేస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్:

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్:

ఈ స్మార్ట్‌ఫోన్‌కు MediaTek MT6737 ప్రాసెసర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. దీనికి తోడు 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్ అలానే మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తాయి. డ్యుయల్ నానో సిమ్‌లకు తోడు ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

కెమెరా :

కెమెరా :

TA-4 హ్యాండ్‌సెట్‌లో రెండు కెమెరాలను Tambo పొందుపరిచింది. ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్ లైట్ సపోర్ట్‌తో తక్కువ వెళుతరులోనూ హై-క్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తోంది.బ్యూటిఫై మోడ్, పానోరమా వంటి ప్రత్యేకమైన మోడ్స్‌ను ఈ కెమెరా యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను TA-4 కలిగి ఉంది.

బ్యాటరీ మరియు సాఫ్ట్‌వేర్:

బ్యాటరీ మరియు సాఫ్ట్‌వేర్:

Tambo TA-4 స్మార్ట్ ఫోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది .ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Tambo TA-4 Launched at Rs 6,999 With Android Nougat, 5.45 Inch HD Display, 2GB RAM & 3000mAh Battery.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X