రికార్డులు తిరగరాసిన ఆపిల్ ఐఫోన్

Written By:

అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ తో పాత రికార్డులను తిరగరాసింది. ఆపిల్ ఐఫోన్ గతేడాది అమ్మకాలను ఈ ఏడాది బ్రేక్ చేసింది. గతేడాది ఐఫోన్ అమ్మకాలు 74.78 మిలియన్లు ఉండగా అది ఈ ఏడాది 78.29 మిలియన్ మార్కుకు చేరుకుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల దెబ్బ ఆపిల్‌ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసిందనే చెప్పాలి.

జియో డేటాతో ఏం చేస్తున్నారంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రికార్డు స్థాయి ఆదాయాన్ని

గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల భారీన పడటంతో ఐఫోన్ 7 అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ అమ్మకాలతో కంపెనీ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించింది.

ఆపిల్‌ రెవెన్యూ

గడిచిన త్రైమాసికంలో ఆపిల్‌ 78.4 బిలియన్‌ డాలర్ల (రూ. 5.30 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుమునుపు ఏడాది ఇదే త్రైమాసికానికి ఆపిల్‌ రెవెన్యూ 75.9 డాలర్లు (రూ. రూ. 5.13 లక్షల కోట్లు) మాత్రమే.

తగ్గిన లాభం

ఆపిల్‌ ఆదాయం పెరిగినప్పటికీ డిసెంబర్‌తో ముగిసే గడిచిన త్రైమాసికంలో లాభం 2.6శాతం తగ్గి 17.9 బిలియన్‌ డాలర్లు (రూ. 1.21 లక్షల కోట్లు) నమోదుచేసింది

రికార్డులు బద్దలుకొట్టడం

గడిచిన హాలిడే త్రైమాసికంలో 78.29 మిలియన్ ఐఫోన్లను ఆపిల్‌ అమ్మింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే ఇది ఐదుశాతం అధికం. రెవెన్యూ వివరాలు వెల్లడిస్తూ ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ అత్యధికస్థాయిలో ఆదాయం ఆర్జించి పలు రికార్డులు బద్దలుకొట్టడం ఆనందంగా ఉందని తెలిపారు.

కంపెనీ షేరు స్టాక్‌మార్కెట్‌లో

గతంలో ఎన్నడూలేనంతగా ఐఫోన్‌ అమ్మకాలు సాధించామని, దీంతో కంపెనీకి గణనీయమైన రెవెన్యూ వచ్చిందని ఆయన తెలిపారు. ఆపిల్‌ ఫలితాలు వెలువడటంతో ఆ కంపెనీ షేరు స్టాక్‌మార్కెట్‌లో మూడుశాతం పెరిగి 125.19 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
With 78 million iPhones sold, Apple achieves record quarter results and beats Samsung read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot