జియో డేటాతో ఏం చేస్తున్నారంటే..?
రిలయన్స్ జియో డేటా ద్వారా అత్యధికులు ఏం చూస్తున్నారనే దానిపై ఓ సర్వే నిర్వహించారు.
జియో రాకతో ఒక్కసారిగా ఇండియాలో విప్లవం మొదలైన విషయం తెలిసిందే. ఉచిత ఆపర్లతో దిగ్గజ టెల్కోలకు షాకిస్తూ రిలయన్స్ జియో ముందుకెళుతోంది. అయితే రిలయన్స్ జియో డేటా ద్వారా అత్యధికులు ఏం చూస్తున్నారనే దానిపై ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో జియో వాడకం మీద కొన్ని ఆసక్తిర విషయాలు తెలిసాయి.
రోడ్డు మీదకు గూగుల్ ఉద్యోగులు, భారత ఐటీకి షాక్
సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఫేస్‌బుక్ కోసమే జియో డేటాను వాడుతున్నారు. స్మార్ట్‌యాప్ అనే స్టడీ ప్రకారం ఇది 467% పెరిగిందని తెలుస్తోంది. రోజుకు జియో రాక ముందు 10 లాగిన్స్ అయ్యే వారు జిడే డేటా వచ్చిన తరువాత 57 సార్లు లాగిన్ అవుతున్నారని స్టడీలో తేలింది. ఎక్కువమంది ఫేస్‌బుక్‌లో టైమ్ లైన్ చెక్ చేయడం కోసమే జియో డేటాని వాడుతున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే జియే డేటాతో ఫేస్‌బుక్ తర్వాత వీడియోల కోసం వాడుతున్నారు. Youtube, Hotstar, Amazon Prime and Netflix ఇలాంటి వాటిని సెర్చ్ చేసేందుకు జియో డేటాని వాడుతున్నారని స్టడీలో తేలింది. జియో రాకముందు ఇది 10 సార్లు లాగిన్ అయితే జియో వచ్చిన తర్వాత 44 సార్లు లాగిన్ అవుతున్నారు. ఇక స్పోర్ట్స్ కోసం జియో డేటాని వాడేవారు చాలా తక్కువట. ఇంతకుముందు కష్టమర్లు 10 సార్లు లాగిన్ అయితే జియే డేటాతో 28 సార్లు లాగిన్ అవుతున్నారు. ఇది 176% పెరిగింది. ఇక న్యూస్ అలాగే మ్యూజిక్ కోసం జియో డేటాని వాడేవారు చాలా తక్కువని తేలింది. ఇంతకు ముందు 10 సార్లు లాగిన్ అయితే జియో డేటా వచ్చిన తరువాత 30 సార్లు లాగిన్ అవుతున్నారు. జియో ఉచిత ఆఫర్ అయిపోయి డేటా ఛార్జీలు వచ్చిన తరువాత కష్టమర్లకు ఎక్కువగా ఫేస్‌బుక్ కోసమే డేటా ప్లాన్ వేయించుకుంటారని, న్యూస్ , అలాగే స్పోర్ట్స్ లాంటి వాటికి అసలు వెళ్లరని స్టడీని బట్టి తెలుస్తోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే జియోకు చెందిన 4జీ ఇంటర్నెట్ డేటాను వాడుతున్న వారే దేశంలో అధికంగా ఉన్నారట. అంతేకాదు, 4జీ మొబైల్ ఫోన్లను వాడుతున్న యూజర్లలో దాదాపు 42 శాతం మంది యూజర్లు జియోను వాడుతున్నారని తెలిసింది. కాగా జియో తరువాత స్థానాల్లో వరుసగా ఎయిర్‌టెల్ (17.54 శాతం యూజర్లు), వొడాఫోన్ (12.26 శాతం), ఐడియా (11.50 శాతం)లు నిలిచాయి.
ఫేస్‌బుక్ కోసమే

జియో రాక ముందు

వీడియోల కోసం

స్పోర్ట్స్ కోసం చాలా తక్కువ

న్యూస్ అలాగే మ్యూజిక్ కోసం

ఉచిత ఆఫర్ అయిపోయి డేటా ఛార్జీలు వచ్చిన తరువాత

దాదాపు 42 శాతం మంది

జియో తరువాత స్థానాల్లో


Click it and Unblock the Notifications








