రిటైల్ షాపుల్లో షియోమీ స్మార్ట్‌ఫోన్‌లు...త్వరలో!!

Posted By:

 రిటైల్ షాపుల్లో షియోమీ స్మార్ట్‌ఫోన్‌లు...త్వరలో!!

ఇటీవల భారత్‌లోకి అడుగుపెట్టి అమ్మకాల సునామీని సృష్టిస్తోన్న చైనా మొబైల్ ఫోన్‌ల కంపెనీ షియోమీ త్వరలో ఆఫ్‌లైన్ బాట పట్టనుంది. ఇప్పటి వరకు షియోమీ స్మార్ట్‌ఫోన్‌లు కేవలం ఆన్‌లైన్ మార్కెట్లో మాత్రమే లభ్యమయ్యేవి. ప్రముఖ ఇ-కామర్స్  వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్డ్ వివిధ మోడళ్ల షియోమీ ఫోన్‌లను మార్కెట్లో విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మరికొద్ది రోజుల్లో షియోమీ స్మార్ట్‌ఫోన్‌లు రిటైల్ దుకాణాల్లో లభ్యంకానున్నాయి. షియోమీ స్మార్ట్‌ఫోన్‌లు సాంప్రదాయ దుకాణాలకు చేరినట్లయితే అమ్మకాల పరంగా మరిన్న సంచలనాలు ఖాయమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తమ కంపెనీ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు వారానికి 2 నుంచి 3 లక్షల రిజిస్ట్రేషన్‌లు నమోదవుతున్నాయని షియోమీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేను పురస్కరించుకుని 1.75 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగామని ఆయన తెలిపారు. షియోమీ కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన రెడ్‌మై నోట్ 4జీ మోడల్ ఈ డిసెంబర్ నుంచి ఎయిర్‌టెల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Xiaomi Partnered with Airtel to Sell Redmi Note, Redmi Note 4G Offline in India. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot