Redmi Note 9 కొనుగోలుకు సరైన సమయం ఇదే!!!

|

సరసమైన ధరలో మిడ్- రేంజ్ ఫోన్‌గా ఇండియాలో విడుదల అయిన షియోమి రెడ్‌మి నోట్ 9 ఈ రోజు మరోసారి అమెజాన్ ఇండియా ద్వారా మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. ఇండియాలో ఇటీవల లాంచ్ అయిన ఈ ఫోన్ కేవలం పరిమిత సమయంలో మాత్రమే అమ్మకానికి వస్తున్నది.

రెడ్‌మి నోట్ 9 సేల్

రెడ్‌మి నోట్ 9 సేల్

షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 9ను అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ.15 వేల ధర లోపు సరికొత్త హ్యాండ్‌సెట్‌ను కొనాలని చూస్తున్న వారికి రెడ్‌మి నోట్ 9 మంచి ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ మరియు సేల్స్ ఆఫర్ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

షియోమి యొక్క రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత అమ్మకం సమయంలో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.11,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.13,499. చివరిది టాప్-ఆఫ్-ది-లైన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999. ఇది ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే అనే మూడు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 22.5W ఫాస్ట్ ఛార్జర్‌తో 5020 mAh భారీ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 22.5W ఫాస్ట్ ఛార్జర్‌తో 5020 mAh భారీ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ ఒక రోజు మొత్తం నాన్ స్టాప్ గా వాడటానికి వీలుగా శక్తివంతమైన సామర్థ్యం గల 5020 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. షియోమి యొక్క సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్లతో బ్యాటరీ వినియోగం విషయానికి వస్తే ఫోన్ చాలా పొదుపుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది 22.5W ఛార్జర్‌తో వస్తున్నప్పటికి ఫోన్‌ను 18W వద్ద మాత్రమే ఛార్జ్ చేయవచ్చు. కానీ రెడ్‌మి నోట్ 9 లో యూజర్లు పూర్తిగా 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను ఆస్వాదించగలరని కంపెనీ ధృవీకరించింది.

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 48MP AI క్వాడ్ కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 48MP AI క్వాడ్ కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 9 ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f / 1.7 లెన్స్‌తో మరియు 1 / 1.7 ″ CMOS ఇమేజ్ సెన్సార్‌తో 48MP మొదటి కెమెరాను కలిగి ఉంది. అలాగే f / 2.2 ఎపర్చరు మరియు 118.2 డిగ్రీల FOV లతో 8MP సెన్సార్‌తో రెండవ కెమెరాను కలిగి ఉంది. ఇది అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మరో రెండు కెమెరాలు వరుసగా మాక్రో మరియు డీప్ సెన్సింగ్ కోసం 2MP సెన్సార్లను ఉపయోగిస్తాయి. అలాగే ముందు భాగంలో 13Mp సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు మరియు వెనుక కెమెరాలలో ఫోటోగ్రఫీ సులభతరం చేయడానికి  AI ఫీచర్లను కలిగి ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 9 గేమింగ్-ఆధారిత ప్రాసెసర్

రెడ్‌మి నోట్ 9 గేమింగ్-ఆధారిత ప్రాసెసర్

రెడ్‌మి నోట్ 9 లో షియోమి క్వాల్‌కామ్ 7XX ప్రాసెసర్‌ను ఉపయోగించడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.ఇది మెడిటెక్ హెలియో G85 SoC ద్వారా రన్ అవుతుంది. హెలియో G85 ను హెలియో G80 SoC కి అప్ డేట్ వెర్షన్ గా పరిగణించవచ్చు. ఇది 12nm ఉత్పాదక ప్రక్రియపై ఆధారపడి రెండు ARM కార్టెక్స్- A75 కోర్లతో 2.0 GHz వద్ద క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది GPU అప్‌గ్రేడ్‌ను చూస్తు ARM మాలి G52 MC2 చిప్‌ను ఉపయోగిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Redmi Note 9 Sale in India Today at 12 PM via Amazon and Mi.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X