రెడ్‍మి నోట్ 4కి షాకిచ్చే ఇండియా ఫోన్ ఇదే, అదీ తక్కువ ధరలో..

Written By:

చైనా ఆపిల్ షియోమికి ధీటుగా ఇండియా ఫోన్ కూడా మార్కెట్లోకి దూసుకొచ్చింది. అత్యంత తక్కువ ధరలో రెడ్‍మి నోట్ 4తో సమానమైన ఫీచర్లతో మైక్రోమ్యాక్స్ యూ యునిక్ 2 వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్‍మి నోట్ 4 కన్నా దీని ధర చాలా తక్కువ. రెండు ఫోన్లను ఓ సారి చూస్తే..

శాంసంగ్‍కు అదిరే షాకిచ్చిన షియోమిl

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర్యామ్

రెడ్‍మి నోట్ 4 2 జిబి ర్యామ్ 32 జిబి ఇంటర్నల్ మెమొరీతో రాగా యూ యునిక్ 2 జిబి ర్యామ్ 16 జిబి ఇంటర్నల్ మెమొరీతో వచ్చింది. అలాగే మైక్రో ఎస్ డీ ద్వారా 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

డిస్ ప్లే విషయానికొస్తే..

డిస్ ప్లే విషయానికొస్తే.. రెడ్‍మి నోట్ 4 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూతో వచ్చింది.
యూ యునిక్ 2 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్తో వచ్చింది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే రెండు ఫోన్లు 13 మెగా ఫిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చాయి.

అదనపు ఫీచర్లు


బ్యాటరీ విషయానికొస్తే రెడ్‍మి నోట్ 4 4100mAh బ్యాటరీతో రాగా యూ యునిక్ 2 2500mAh బ్యాటరీతో వచ్చింది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్) రెడ్‍మి నోట్ 4 అదనపు ఫీచర్లు, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ యూనిక్ 2 అదనపు ఫీచర్లు

ధర

ధర విషయానికొస్తే రెడ్‍మి నోట్ 4 ధర మార్కెట్లో 9,999గా ఉంది. అదే యూనిక్ 2 ధర కేవలం 5,999 మాత్రమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Yu Yunique 2 to Go on Sale for First Time in India Today, via Flipkart
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot