మీ 60 ఏళ్ల ఫోటోను ఇప్పుడే చూడొచ్చు

Posted By:

ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అనంతరం యాప్ విప్లవం వచ్చింది. ఇప్పుడు ప్రతి దానికి ఒక యాప్ ఉన్నది. అది వ్యాపారానికి సంబంధించినది కావొచ్చు..ఫ్యాషన్ రంగానికి చెందినది కావొచ్చు.. మరో రంగానికి మరో రంగానికి చెందినది కావొచ్చు. యాప్ లేకపోతే.. ప్రపంచం ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో పడిపోయింది.ఇప్పుడు అదే విధంగా పిల్లలుగా ఉన్నవారు పెరిగి పెద్దయిన తరువాత ఎలా ఉంటారు వారి ఫేస్ ఎలా ఉంటుంది అనే దానికి ఓ యాప్ ను తయారు చేసారు.దానిపై ఓ స్మార్ట్ లెక్కేద్దాం.

Read more : రోబోల దెబ్బకు కోట్ల ఉద్యోగాలు గల్లంతు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నూత్నమైన యాప్

ఇటీవలే బ్రాడ్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హసల్ ఉగేల్ ఓ వినూత్నమైన యాప్ ను తయారు చేశారు.

పిల్లలుగా ఉన్న వారు పెరిగి పెద్ద వారైన తరువాత వారు ఎలా ఉంటారు

ఈ యాప్ ద్వారా ఇప్పుడు పిల్లలుగా ఉన్న వారు పెరిగి పెద్ద వారైన తరువాత వారు ఎలా ఉంటారు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చట. అంతేకాదండోయ్ ఈ యాప్ ద్వారా గతంలో ఎలా ఉన్నారు అనే విషయం కూడా తెలుసుకునే అవకాశం ఉందని ఉగేల్ చెప్తున్నారు.

60 లో ఎలా ఉంటారనే విషయంపై ప్రయోగం

లండన్ రాయల్ ఫ్యామిలీలోని చిన్నపిల్లలను ఈ యాప్ ద్వారా వారు 20, 40 తరువాత 60 లో ఎలా ఉంటారనే విషయంపై ప్రయోగం చేశారు.

ఎంజలీనా జోలి ఫోటోల పరిశీలన

అలాగే ఎంజలీనా జోలి ప్రస్తుత ఫోటోలను ఈ యాప్ ద్వారా 20 వ సంవత్సరంలో ఎలా ఉన్నారు అన్న విషయాన్ని పరిశీలించారు.

80 శాతం ఖచ్చితత్వం

ఈ పరిశీలనలో 80 శాతం ఖచ్చితత్వం కనిపించిందని ప్రొఫెసర్ ఉగేల్ తెలియజేశారు. అయితే ఈ యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని ఆయన చెబుతున్నారు. మరి మీరు కూడా మీ పెద్దయ్యాక ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే ఇంకా కొన్నాళ్లుఆగక తప్పదు.

వివిధ వయసుల్లో ఉన్న వారి ఫోటోలు

వివిధ వయసుల్లో ఉన్న వారి ఫోటోలు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write All grown up! Age-progression software lets you see your child as an adult - and it's surprisingly accurate
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot