1 బిలియన్ యాహూ అకౌంట్లు అమ్మకానికి..

Written By:

ఇంటర్నెట్ దిగ్గజం యాహూ మరోసారి చిక్కుల్లో పడింది. 2013లో హ్యాకింగ్‌కు గురైన 1 బిలియన్ అకౌంట్లు(100 కోట్లు) 2,00,000 డాలర్ల(రూ.1,30,95,620)కు లేదా బెస్ట్ ఆఫర్‌కు సైబర్ నేరగాలు అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. పాస్‌వర్డ్ లు వర్క్ చేయడం లేదని కానీ యూజర్ల డేటాఫ్ బర్త్స్, టెలిఫోన్ నెంబర్లు, సెక్యురిటీ క్వశ్చన్స్‌ను సైబర్ నేరగాడు వాడుతున్నాడని న్యూయార్క్ రిపోర్టు తెలిపింది.

బాహుబలి ట్రైలర్ రికార్డు వెనుక జియో హస్తం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2014లో 500 మిలియన్ యూజర్ల హ్యాకింగ్ పై

ఇప్పటికే 2014లో 500 మిలియన్ యూజర్ల హ్యాకింగ్ పై రష్యాకు చెందిన నలుగురు వ్యక్తులు నేరాపోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు హ్యాకర్స్ కాగ, మరో ఇద్దరు ఇంటిలిజెన్స్ ఆఫీసర్లు.

2013లో జరిగిన ఈ హ్యాకింగ్ ను

2013లో జరిగిన ఈ హ్యాకింగ్ ను అతిపెద్ద దాడిగా వర్ణించిన యాహూ, 2014లో జరిగిన దాడిని రెండో అతిపెద్ద సైబర్ ఎటాక్ గా పేర్కొంది.

2013 సైబర్ దాడి

తాజాగా వెలుగులోకి వచ్చిన 2013 సైబర్ దాడితో యాహూ మరోసారి చిక్కుల్లో పడిపోయింది.

ఏమైనా సంబంధం ఉందా?

2013 జరిగిన సైబర్ దాడికి, 2014లోజరిగిన హ్యాకింగ్ కు ఏమైనా సంబంధం ఉందా? లేదా ? అనే విషయంపై కంపెనీ విచారణ చేపడుతోందని, పూర్తిగా విచారించిన తర్వాతనే దీనిపై కామెంట్ చేస్తామని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సైబర్ సెక్యురిటీ డివిజన్ మాల్కం పాల్మోర్ తెలిపారు.

వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం

ఈ దాడిలో వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం తస్కరించబడినట్టు కంపెనీ ప్రకటించింది. తమ ఖాతాదారులకు తమ పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ ప్రశ్నల జవాబులను మార్చుకోవాలని సంస్థ కోరింది. మరోవైపు ఈ హ్యాకింగ్ ఘటనలు వెరిజోన్‌తో ఉన్న డీల్‌ను దెబ్బతీస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
1 billion Yahoo accounts on sale, despite hacking indictments: Report read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot