బాహుబలి ట్రైలర్ రికార్డు వెనుక జియో హస్తం..?

Written By:

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 ట్రైలర్ చరిత్ర తిరగరాస్తూ రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో 24 గంటల్లో 50 మిలియన్ల( 5 కోట్ల)కు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. లైక్స్ విషయంలో అంతర్జాతీయ చిత్రాలను టార్గెట్ చేస్తూ దూసుకుపోతోంది.

ఆల్ రికార్డ్స్ బ్రేక్.. ఆ యాప్‌ని 1.8 కోట్ల మంది ఇష్టపడ్డారు

బాహుబలి ట్రైలర్ రికార్డు వెనుక జియో హస్తం..?

ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన 'అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్' మించి పోయింది బాహుబలి. అవెంజర్స్‌కు 5 లక్షల 16 వేల లైక్స్ వచ్చాయి. బాహుబలి 2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. వ్యూస్ పరంగా అవెంజర్స్‌ను బీట్ చేయలేకపోయినా.. 5 లక్షల 57 వేలకు పైగా లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సవాల్ విసిరింది.

మీ మొబైల్ ఎంత డేంజరంటే...?

బాహుబలి ట్రైలర్ రికార్డు వెనుక జియో హస్తం..?

అయితే బాహుబలి ఇంతటి భారీ రికార్డ్ సాధించడానికి జియోనే ప్రధానకారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మొబైల్ నెట్‌వర్క్ సంస్థ జియో, ఫ్రీ ఆఫర్ కారణంగానే బాహుబలికి ఈ రికార్డ్ సాధ్యమయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్రీ ఆఫర్ ఈ నెలాఖరున ముగుస్తుండటంతో ఇక పై రాబోయే చిత్రాల టీజర్లు. ట్రైలర్లకు ఈ రికార్డ్‌లు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు.

 

 English summary
Jio Effect: Baahubali 2 Trailer Gets Record youtube Views read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting