ఆధార్ పే లాంచ్ అయింది, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!

Written By:

కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఆధార్ పే యాప్‌ను ఎట్టకేలకు ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా మీరు కార్డులు లేకుండానే లావాదేవీలు జరపవచ్చు. కొత్త టెక్నిక్‌లో ఈజీ పద్ధతిలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి ఇప్పుడు ఈ ఆధార్ పే ను తీసుకొచ్చింది. ఈ మధ్యనే భీమ్ యాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ఆధార్ పే యాప్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

మోటో నుంచి 2 బెస్ట్ ఫీచర్ ఫోన్లు, 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫీజులు ఆదా

ఆధార్‌ పేను వినియోగించడం వల్ల క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల కంపెనీలకు చెల్లించాల్సిన ఫీజులు ఆదా అవుతాయి.

నో మొబైల్‌

క్యాష్‌లెస్ ట్రాన్సిక్షన్స్ ఈ యాప్ ద్వారా చేయవచ్చు. యాప్‌ను వినియోగించేందుకు వినియోగదారునికి మొబైల్‌ ఉండాల్సిన అవసరం లేదు. అయితే వ్యాపారి మాత్రం మొబైల్‌ను కచ్చితంగా వినియోగించాలి.

మీ పింగర్ ప్రింటే మీ పాస్‌వర్డ్

ఈ యాప్ బయో మెట్రిక్ పద్దతిలో వస్తోంది కాబట్టి మీ పింగర్ ప్రింటే మీ పాస్‌వర్డ్ అవుతుంది. కాబట్టి ఆధార్‌ పే ద్వారా చెల్లింపులు జరిపేందుకు సదరు వ్యక్తి వేలి ముద్ర(బయోమెట్రిక్‌ పద్దతి) ఇవ్వాల్సివుంటుంది.

బ్యాంకు ఖాతాలతో మీ ఆధార్‌ నంబర్‌

బ్యాంకు ఖాతాలతో మీ ఆధార్‌ నంబర్‌ను అనుసంధానిస్తేనే ఆధార్‌ పే యాప్‌ను వినియోగించడానికి వీలుకలుగుతుంది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి

ఈ యాప్ వాడాలంటే మీరు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆధార్‌ పే యాప్‌, బయోమెట్రిక్‌ స్కానర్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడు లావాదేవీలు జరపడానికి వచ్చినప్పుడు వ్యక్తి ఆధార్‌ నంబర్‌ను ఆధార్‌ పే యాప్‌లో టైప్‌ చేసి బయోమెట్రిక్‌ స్కానర్‌లో ఫింగర్‌ ప్రింట్‌ను తీసుకోవాలి.

కొనుగోళ్లు జరపడానికి మాత్రమే

ఇది ఇంటర్నెట్ ఉంటేనే పనిచేస్తుంది. దీంతో పాటు ఇది కేవలం కొనుగోళ్లు జరపడానికి మాత్రమే ఆధార్‌ పే యాప్‌ ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్స్‌ఫర్లను ఈ యాప్‌ ద్వారా నిర్వహించలేం.

ప్రస్తుతం రూ.10వేల వరకూ లావాదేవీలు

దీని ద్వారా మీరు ప్రస్తుతం రూ.10వేల వరకూ లావాదేవీలు జరపొచ్చు. ఈ యాప్‌ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీపీఐ), యూఐడీఏఐలు కలిసి రూపొందించాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Aadhaar Pay app launched: 10 things you must know Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot