యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు బంపరాఫర్, 250 జిబి ఉచిత డేటా

Written By:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 లో భాగంగా అన్ని కంపెనీలు కస్టమర్లను ఆఫర్ల మత్తులో మంచుత్తుతున్నాయి. టెలికాం టాప్ దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు తమ యూజర్లకు ఇప్పటికే ఐపీఎల్ సమ్మర్ ఆఫర్లతో కూల్ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. ఇక ఇదే బాటలో బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా నడిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు డేటా ఆఫర్ అందించగా ఇదే బాటలో యాక్ట్ కూడా నడుస్తోంది. ఐపీఎల్ సందర్భంగా ప్రేక్షకులకు మ్యాచ్‌లను చూసేందుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆ సంస్థ తన కస్టమర్లకు ఏప్రిల్ నెలకు గాను 250 జీబీ ఉచిత డేటాను అందిస్తున్నది.

యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు బంపరాఫర్, 250 జిబి ఉచిత డేటా

యాక్ట్ ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్న యూజర్లందరికీ ఈ ఉచిత డేటా లభిస్తుంది. మరోవైపు ఈ సంస్థ ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్‌కు అఫిషియల్ ఫైబర్‌నెట్ పార్ట్‌నర్‌గా కూడా వ్యవహరిస్తున్నది. అందులో భాగంగానే చెన్నై మ్యాచ్‌లు జరిగే ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రేక్షకులకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తున్నది. దీంతో ఓ వైపు స్టేడియంలో మ్యాచ్ చూస్తూనే మరో వైపు మొబైల్స్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ప్రేక్షకులు పొందవచ్చు.

బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలను సవాల్ చేస్తూ ఎయిర్‌టెల్‌ తన తొలి 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలవారీ రెంటల్‌ రూ.2199తో ఈ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫైబర్‌-టూ-ది-హోమ్‌(ఎఫ్‌టీటీహెచ్‌) సర్వీసు సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ స్పెషల్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది.

డ్యూయెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ వెంట పడే ముందు ఈ నిజాలు తెలుసుకోండి !

ఈ కొత్త ప్లాన్‌ కింద 1200జీబీ ఆల్ట్రా హై స్పీడు డేటాను అపరిమిత ఎస్టీడీ, లోకల్‌ కాలింగ్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ కొత్త 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు, ఎయిర్‌టెల్‌ వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ టీవీ వంటి ఓటీటీ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది. అంతేకాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను యూజర్లు పొందనున్నారు.

ఈ ప్లాన్‌ డేటా రోల్‌అవుట్‌ ప్రయోజనాలను, ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజ్‌, మైహోమ్‌ రివార్డులను అందించనుంది. అంతేకాకుండా 1టీబీ బోనస్‌ డేటా కూడా అక్టోబర్‌ 31 వరకు యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇది కేవలం ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌ కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే. అయితే ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సైట్‌ను విజిట్‌ చేసి, సబ్‌స్క్రైబర్లు తమ సర్కిళ్లు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలని సూచించింది.

English summary
ACT Fibernet Gifting 250GB Data to Broadband Customers as T20 Data Surprise More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot