రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్

|

భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో రెండు కంపెనీలు మాత్రమే మార్కెట్లో 4G హాట్‌స్పాట్ వై-ఫై పరికరాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా తమ సొంత ఉత్పత్తులను కలిగి ఉన్నప్పటికీ ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తులతో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

 
airtel 4g hotspot postpaid

ఇది వినియోగదారులకు వారి పరికరాల కోసం వై-ఫై హాట్‌స్పాట్‌లను స్థాపించడంలో సహాయపడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఎయిర్‌టెల్ తన 4G హాట్‌స్పాట్ డివైస్ ధరలను చాలా వరకు సవరించి వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఇది కాకుండా ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ యొక్క ప్లాన్ల ధరలలో కూడా మార్పు వచ్చింది.

airtel 4g hotspot postpaid

కానీ ఇప్పుడు టెలికాం ఆపరేటర్ ఈ ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ కొనుగోలుపై 1000రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది. కొనుగోలుదారులు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఎలా పొందగలరు అనే దాని గురించి తెలుసుకోవడానికి క్రింద చదవండి.

భారతి ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్:

భారతి ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్:

ఇంతకు ముందు ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ 999 రూపాయలకు లభిస్తున్నది.తరువాత ఎయిర్‌టెల్ డివైస్ ధరను రూ.2,000లకు పెంచింది. కాబట్టి మొదట ఆసక్తిగల కొనుగోలుదారులు ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ న్ని సాధారణంగా రూ.2,000 కు కొనుగోలు చేయాలి. ఇలా చేసిన తరువాత వారు తమ ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్‌ను రూ.399 రీఛార్జ్ ప్లాన్ లేదా రూ.499 రీఛార్జ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ సమయంలో ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ కొనుగోలు చేసే చందాదారులు యాక్టివేషన్ ఛార్జీగా రూ.300 చెల్లించవలసి ఉంటుంది. ఇలా చేసిన తరువాత చందాదారులకు రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.ఈ క్యాష్‌బ్యాక్ మీ పోస్ట్‌పెయిడ్ ఖాతాకు జమ చేయబడుతుంది ఇది భవిష్యత్తులో బిల్లుల చెల్లింపుల కోసం ఉపయోగించబడుతుంది.

ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ రీఛార్జ్ ప్లాన్స్:
 

ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ రీఛార్జ్ ప్లాన్స్:

అధికారిక ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు ఎయిర్‌టెల్ తన ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ ధరలను సవరించినట్లు చూడవచ్చు. కొనుగోలుదారులు తమ హాట్‌స్పాట్‌లో ఇంటర్నెట్‌ను పొందడం కోసం చందా పొందగల రెండు ప్రణాళికల ప్రస్తావన కూడా ఉంది.ఇందులో 399రూపాయల మొదటి ప్లాన్ 4G హాట్‌స్పాట్ డివైస్ కోసం రోస్టర్‌లో లభించే చౌకైన ప్లాన్. ఇది నెలకు 50GB డేటాను అందిస్తుంది.ఇది కూడా 1,000రూపాయల క్యాష్‌బ్యాక్‌తో వస్తుంది. ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ ప్లాన్స్ రోస్టర్‌లో లభించే మరో ప్లాన్ రూ .499 ప్లాన్. ఇది నెలకు 75 జిబి డేటాను అందిస్తుంది. పైన పేర్కొన్న ఈ రెండు ప్లాన్‌లు రూ.1,000 క్యాష్‌బ్యాక్‌తో వస్తాయి. ఈ రెండు ప్లాన్‌లు డేటా క్యారీ-ఫార్వర్డ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నాయి. 399రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఆఫర్ కొన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉండకపోవచ్చు.

ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ ఫీచర్స్:

ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ ఫీచర్స్:

భారతి ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ డివైస్ రిలయన్స్ జియో యొక్క JioFiకి మంచి సమాధానంగా ఇచ్చిన సమర్పణ. వినియోగదారులు తమ టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవాటిని హాట్‌స్పాట్‌తో కనెక్ట్ చేయడానికి సులభంగాఈ డివైస్ అనుమతిస్తుంది అంతే కాకుండా ఇది ఒకేసారి 10 పరికరాలను కనెక్ట్ చేయగలదు. ఈ డివైస్లను తయారు చేయడానికి ఎయిర్టెల్ హువావేతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇవి 1,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తాయి ఇవి ఎక్కువసేపు బ్యాటరిని కలిగి ఉంటాయి. ఎయిర్‌టెల్ 4G హాట్‌స్పాట్ 3G నెట్‌వర్క్‌కు మారే సామర్ధ్యంతో కూడా వస్తుంది. ఇది JioFiకి భిన్నంగా ఉంటుంది.JioFi ఎల్లప్పుడూ 4G నెట్‌వర్క్‌తో నడుస్తుంది.

Best Mobiles in India

English summary
airtel 4g hotspot postpaid

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X