Airtel Broadband Plans: అపరిమిత డేటా కోసం తక్కువ ధర వద్ద యాడ్-ఆన్‌ ప్లాన్...

|

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ప్రస్తుతం కేవలం ఇంటి వద్దకు మాత్రమే పరిమితం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అనేది ప్రజల యొక్క రోజువారీ వినియోగంలో ముఖ్యమైనదిగా మారింది. ప్రసుత కాలంలో ఇంటర్నెట్ లేకుండా ప్రజలు తమ పనులను చేయలేకపోతున్నారు. ఇండియా మొత్తం డిజిటల్ రంగంలోకి మారడంతో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అవసరం ఎక్కువ అయింది.

బ్రాడ్‌బ్యాండ్

ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ మొబైల్ డేటా ప్లాన్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ అవి ఇప్పటికీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మాదిరిగా అధిక వేగంతో డేటాను అందించవు. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో అద్భుతమైన ఆఫర్లతో మంచి ప్రయోజనాలను అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లేయర్‌లలో ఎయిర్‌టెల్ ఒకటి. కొంతకాలం క్రితం ఎయిర్‌టెల్ తన ఫైబర్ సేవలను కూడా ప్రారంభించింది. భారతదేశంలోని ప్రతి విభాగంలోను ఎయిర్‌టెల్ వారి ఫైబర్ కనెక్షన్‌లను ఏర్పాటు చేయడంలో ఇది ఇప్పటికీ ప్రారంభ దశ ఉంది. ఈ టెల్కో యొక్క సేవలు భారతదేశంలోని ప్రధాన నగరాలకు చేరుకోగలిగింది. అతి త్వరలో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్లు భారతదేశం అంతటా అందుబాటులో ఉంటాయి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు నాలుగు వైవిధ్యాలతో రూ.799, రూ.999, రూ.1,499, రూ.3,999 ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. మొదటి ప్లాన్‌లకు ఎఫ్‌యుపి పరిమితి ఉండగా ఎయిర్‌టెల్ యొక్క రూ.3999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క డేటా యొక్క ఆఫర్ అపరిమితంగా వస్తుంది. భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అపరిమిత డేటా కోసం యాడ్-ఆన్ ప్లాన్ ను రూ.299 ధర వద్ద అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.299 యాడ్-ఆన్‌ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.299 యాడ్-ఆన్‌ ప్లాన్

ఎయిర్‌టెల్ ఫైబర్ కనెక్షన్‌లో మీరు ఎంచుకున్న ప్లాన్ మీద FUP డేటా పరిమితి అయిపోయినట్లయితే మరియు మీకు ఇకపై హై-స్పీడ్ డేటా లేనప్పుడు మీరు ఎయిర్‌టెల్ నుండి అదనపు అపరిమిత డేటా కోసం యాడ్-ఆన్‌ ప్యాక్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది నెలకు రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఇది అధిక వేగంతో అపరిమిత డేటాను యాక్సెస్ చేస్తుంది. కానీ ఇక్కడ అపరిమిత డేటా అంటే 3.3TB డేటాకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ అది మనలో మెజారిటీకి సరిపోతుంది.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ బేసిక్ ప్లాన్

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ బేసిక్ ప్లాన్

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌తో మీకు లభించే చౌకైన ప్లాన్ బేసిక్ ప్లాన్ దీని యొక్క ధర రూ.799. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 100Mbps వేగంతో 150GB డేటాను పొందవచ్చు. దీనితో పాటుగా అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. అలాగే మీరు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ చందా యొక్క ఒకే ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ తో మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మీరు మీ హై-స్పీడ్ 150GB డేటాను అయిపోయిన తర్వాత డేటా యొక్క స్పీడ్ 1 Mbps కు తగ్గించబడుతుంది.

ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్లాన్ నెలకు రూ.999 ధర వద్ద 200Mbps వేగంతో 300GB వరకు డేటాను మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఎంటర్టైన్మెంట్, ప్రీమియం మరియు విఐపి ప్లాన్ చందాదారులు అమెజాన్ ప్రైమ్ మరియు Zee5 సభ్యత్వాలతో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌కు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. ఆరునెలల ఎంటర్టైన్మెంట్ ప్లాన్ యొక్క చందాను పొందే వినియోగదారులు నెలకు రూ.924 తగ్గింపు ధరతో మొత్తంగా రూ.5544 చెల్లించ వలసి ఉంటుంది.

ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్

ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క ప్రీమియం ప్లాన్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ యొక్క సారూప్య ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులు దీనిని ఒక నెలకు రూ.1499 ధర వద్ద పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 500GB డేటాను 300Mbps వేగంతో బ్రౌజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రీమియం ప్లాన్ యొక్క ఆరు నెలల చందాను ఎంచుకొనే వారికి నెలకు రూ.1388 చొప్పున మొత్తంగా రూ.8319 చెల్లించవలసి ఉంటుంది.

ఎయిర్‌టెల్ VIP ప్లాన్

ఎయిర్‌టెల్ VIP ప్లాన్

VIP ప్లాన్ అనేది ఎయిర్టెల్ యొక్క శ్రేణిలో గల అగ్రశ్రేణి ప్లాన్. ఇది 1 Gbps వేగంతో బ్రౌజ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ యొక్క అపరిమిత కాలింగ్ మరియు ఇతర ప్రయోజనాలు కూడా విఐపి ప్లాన్‌పై వర్తిస్తాయి. విఐపి ప్లాన్‌పై కంపెనీ "అపరిమిత డేటా" ను అందిస్తుంది. ఈ అపరిమిత డేటా ప్లాన్‌లో 3333GBu సరసమైన డేటా వినియోగ పాలసీ క్యాప్‌ను కలిగి ఉందని గమనించాలి. విఐపి ప్లాన్ యొక్క సెమీ వార్షిక చందాదారులు రూ .22,194 చెల్లించాలి. ఇది ఎయిర్టెల్ తన నెలవారీ చందాదారులను వసూలు చేసే 3999 రూపాయలకు బదులుగా నెలకు రూ .3699 తక్కువ ధరకు అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Broadband and Data Add-On Plans Details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X