4జీ...ఎయిర్‌టెల్ మరో భారీ డీల్

Written By:

దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్ మరో భారీ డీల్‌కి తెరలేపింది. భారత్‌లో 4జీ ఇంటర్నెట్ సేవల్ని మరింత వేగంగా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ‍ ప్రముఖ దేశీయ బ్రాడ్‌బాండ్‌ సేవల సంస్థ టికోనా ను కొనుగోలు చేయనుంది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్‌ను స్వాధీనం చేసుకోనుంది.

సూపర్ మారియో గేమ్ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసింది..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డీల్‌ విలువ రూ.1600కోట్లు

టికోనా 4జీ డిజిటల్‌ నెట్‌వర్క్‌ బిజినెస్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్‌ టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.1600కోట్లుగా తెలిపింది.

ఐదు టెలికాం సర్కిల్స్‌లో 350 సైట్లు

ఈ ఒప్పందం ద్వారా టికోనా బ్రాడ్‌ బాండ్‌ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం సహా, ఐదు టెలికాం సర్కిల్స్‌లో 350 సైట్లు తమ సొంతంకానున్నట్టు ఎయిర్టెల్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది.

వొడాఫోన్‌, ఐడియా మెగామెర్జర్‌

కాగా ఒకవైపు జియో ఉచిత సేవల ఎంట్రీతో రిలయన్స్‌ జియో సునామీ సృష్టిస్తే.. వొడాఫోన్‌, ఐడియా మెగామెర్జర్‌ టెలికాం పరిశ్రమలో సంచలనంగా మారింది.

టికోనా కొనుగోలుతో

టికోనా కొనుగోలుతో దేశంలో రిలయన్స్‌ జియో తర్వాత దేశవ్యాప్త 4జీ నెట్‌వర్క్‌ ఉన్న కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్‌ అవతరిస్తుంది.

వినియోగదారులకు మరింత వేగవంతమైన వైర్లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌

టికోనా సంస్థ కొనుగోలుతో వినియోగదారులకు మరింత వేగవంతమైన వైర్లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించగలమని కంపెనీ ఎండీ, సీఈఓ (ఇండియా,దక్షిణాసియా) గోపాల్‌ విట్టల్‌ చెప్పారు.

టికోనా సంస్థకు

టికోనా సంస్థకు గుజరాత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్‌ ప్రదేశ్‌ టెలికం సర్కిళ్లలో 2,300 మోగాహెట్జ్‌ బ్యాండ్‌పై 20 మెగా హెట్జ్‌ స్పెక్ట్రమ్‌ ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel to Buy Tikona's 4G Business for Rs. 1,600 Crores read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot