ఎయిర్‌టెల్‌ మళ్లీ దుమ్మురేపింది

Written By:

దేశంలో అత్యధిక వినియోగదారులను కలిగిన టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మరో ఘనత అందుకుంది. అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌లో దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2016 సంవత్సరానికి గానూ అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌'గా ఎయిర్‌టెల్‌ నిలిచిందని బ్రాడ్‌బ్యాండ్‌ టెస్టింగ్‌, నెట్వర్క్‌ విశ్లేషణ అప్లికేషన్‌ ఓక్లా తాజాగా వెల్లడించింది. అయితే గత కొద్దిరోజులుగా ఒడుదొడుకులు ఎదుర్కొన్న కంపెనీ తన నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని గట్టిగా నమ్ముతూ వచ్చింది.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017, అదరహో అనిపించిన బెస్ట్ ఫోన్స్ ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2016లో అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌‌

2016లో అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌‌గా భారతీ ఎయిర్‌టెల్‌ నిలిచిందని బ్రాడ్‌బ్యాండ్‌ టెస్టింగ్‌, నెటవర్క్‌ విశ్లేషణ అప్లికేషన్‌ ఓక్లాతాజాగా వెల్లడించింది.

స్పీడ్‌టెస్ట్‌ యాప్‌ ద్వారా

ఓక్లాకు చెందిన స్పీడ్‌టెస్ట్‌ యాప్‌ ద్వారా దేశంలోని మొబైల్‌ వినియోగదారులపై ఆధునిక పరికరాలతో మిలియన్ల సంఖ్యలో స్పీడ్‌ టెస్టులు నిర్వహించి ఈ నివేదిక తయారు చేశారు.

ఓక్లా నుంచి ఎయిర్‌టెల్‌కు గుర్తింపు లభించినందుకు

వినియోగదారులకు నిరంతరం సాధ్యమైనంత మేర మంచి సేవలు అందించడానికి ఎయిర్‌టెల్‌ ప్రయత్నిస్తుందని, ప్రపంచస్థాయి సంస్థ ఓక్లా నుంచి ఎయిర్‌టెల్‌కు గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ భారత్‌, దక్షిణాసియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అజయ్‌ పూరి తెలిపారు.

డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అంశంలో

అయితే డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అంశంలో ఇటీవల టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) వెల్లడించిన గణాంకాల్లో కూడా ఎయిర్‌టెల్‌ అగ్రస్థానంలో నిలిచింది.

డిసెంబర్‌లో ఎయిర్‌టెల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌

గతేడాది డిసెంబర్‌లో ఎయిర్‌టెల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ సగటున సెకనుకు 4.68ఎంబీపీఎస్‌ ఉండగా జనవరిలో రెండింతలు పెరిగి 8.42కు చేరింది. డిసెంబర్‌లో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ గరిష్ఠంగా 18.14 ఎంబీపీఎస్‌గా నమోదు కావడం గమనార్హం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Airtel Rated as India's Fastest Mobile Network for 2016 by Ookla read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting