జియోకి డైరక్ట్ కౌంటర్ వేసిన ఎయిర్‌టెల్

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తాజాగా తీసుకొచ్చింది.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తాజాగా తీసుకొచ్చింది.టెలికాం పరిశ్రమలోకి దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో 149 రూపాయల ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్‌ ఈ సరికొత్త ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. రూ.149 రూపాయల ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ లో రోజులు 1 జీబీ డేటా చొప్పున 28 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నారు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వాలిడిటీ 28రోజులు. అయితే 28 రోజుల వాలిడిటీ ఉన్న జియో 149 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది. ఇదిలా ఉంటే దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన బ్రాడ్‌బ్యాండు యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. Airtel ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్‌ బైట్‌ ఆఫర్‌ను 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది.

వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్, వారికి మాత్రమేనటవాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్, వారికి మాత్రమేనట

గతేడాది మేలో లైవ్ లోకి..

గతేడాది మేలో లైవ్ లోకి..

ఈ ఆఫర్ గతేడాది మేలో లైవ్ లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆఫర్ 2018 మార్చి 31తో ముగిసిపోవడంతో యూజర్ల కోసం ఈ ఆఫర్ ను అక్టోబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ తాజాగా ప్రకటించింది. దీంతో పాటు ఈ ఆఫర్ పొడిగింపులో భాగంగా కస్టమర్లు 1000GB బోనస్ డేటాను గిఫ్ట్ గా అందించింది. బేస్‌ ప్లాన్‌పై ఎంత స్పీడులో డేటా లభిస్తోందో, బోనస్‌ డేటా కూడా అదే నెట్‌ స్పీడును యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

రూ.1099, రూ.1299 ప్లాన్లపై..

రూ.1099, రూ.1299 ప్లాన్లపై..

ఎయిర్‌టెల్‌ యూజర్లకు బిగ్‌ బైట్‌ ఆఫర్‌ రూ.1099, రూ.1299 ప్లాన్లపై అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ల కింద ఉన్న యూజర్లు ఇప్పుడు 2108 అక్టోబర్ వరకు 1000 జిబి బోనస్ డేటాను అందుకోవచ్చు. అదనపు డేటాను ప్రతి నెలా క్యారీ ఫార్వర్డ్‌ చేయనున్నామని, అలా 2018 అక్టోబర్‌ 31 వరకు లేదా డేటా ముగిసే వరకు చేస్తామని కంపెనీ ప్రకటించింది.

రీజన్‌ రీజన్‌కు వేరువేరుగా..

రీజన్‌ రీజన్‌కు వేరువేరుగా..

అయితే ఈ ప్లాన్‌ ధరలు రీజన్‌ రీజన్‌కు వేరువేరుగా ఉన్నాయి. ఢిల్లీ యూజర్లకైతే రూ.1099 ప్లాన్‌పై 250జీబీ అదనపు డేటాతో పాటు 1000జీబీ బోనస్‌ డేటా లభిస్తోంది. 100 ఎంబీపీఎస్‌ స్పీడులో ఈ డేటాను ఎంజాయ్‌ చేసుకోవచ్చు.

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను..

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను..

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు.రెండో ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ రూ.1299 కింద అపరిమిత కాల్స్‌ను, 250జీబీ బ్రాడ్‌బ్యాండ్‌ డేటాను, 1000జీబీ బోనస్‌ డేటాను యూజర్లు పొందుతారు. దీని స్పీడు కూడా 100ఎంబీపీఎస్‌గా ఉంటుంది.

ఈ 1000 బోనస్‌ డేటాను పొందడమెలా?

ఈ 1000 బోనస్‌ డేటాను పొందడమెలా?

ఈ ఆఫర్‌ను పొందడానికి పేజీని విజిట్‌ చేసి, ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ వివరాలను నమోదు చేయాలి. ఒక్కసారి ఆ ప్రక్రియంతా అయిపోయిన తర్వాత, అదనపు డేటా ఏడు రోజుల తర్వాత బేస్‌ ప్లాన్‌కు యాడ్‌ అవుతుంది. ఈ ఆఫర్‌ పొండానికి రెండు ప్లాన్లలో(రూ.1099, రూ.1299) ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Amazon Prime subscription

Amazon Prime subscription

ఈ ప్లాన్లతో పాటు కంపెనీ Amazon Prime subscriptionను కూడా ఉచితంగా అందిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్లాన్ల వివరాలు మారే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ అఫిషియల్ పేజీలోకి వెళ్లి ఈ ప్లాన్ వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel's Rs. 149 Prepaid Plan Offers 1GB Per Day Data For 28 Days. Check Other Benefits Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X