రోబోల దెబ్బకు కోట్ల ఉద్యోగాలు గల్లంతు

By Hazarath
|

రోబోలతో కోట్ల ఉద్యోగాలు గల్లంతు కానున్నాయి.దాదాపు 18 వేల కోట్ల ఉద్యోగాలకు ఎసరు రానుంది..18వేల కోట్లా అని ఆశ్చర్యపోకండి..ఇది నిజం..పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం జర్మనీలో రోబోట్ల భయం కొత్తగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో రోబోట్ల చేత పని చేయించుకుంటున్న జర్మనీ పరిశ్రమలు ప్రజల ఉపాధిని హరించివేస్తున్నాయి. రోబోట్ టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతుండడంతో జర్మనీ ఉద్యోగాలలో 18 మిలియన్ల మేర రోబోట్లు ఆక్రమిస్తాయని ఐ.ఎన్.జి-డిబా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.మరి ఎలా గల్లంతవుతున్నాయో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:ఫేస్‌బుక్‌లో ఉద్యోగాలివే బాసూ

మొత్తం ఉపాధిలో 59 శాతాన్ని రోబోట్లు హరించివేస్తాయి
 

మొత్తం ఉపాధిలో 59 శాతాన్ని రోబోట్లు హరించివేస్తాయి

జర్మనీలో పూర్తి కాలం ప్రాతిపదికన గానీ పార్ట్ టైమ్ ప్రాతిపదికన గానీ మొత్తం 30.9 మిలియన్ల మంది (3.09 కోట్లు) వివిధ రంగాలలో ఉపాధి పొందుతుండగా వారిలో 18 మిలియన్ల మంది రోబోట్ల వల్ల ఉపాధి కోల్పోతారని అధ్యయనం తెలిపింది. అనగా మొత్తం ఉపాధిలో 59 శాతాన్ని రోబోట్లు హరించివేస్తాయన్నమాట!

కంప్యూటర్ టెక్నాలజీ, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ..

కంప్యూటర్ టెక్నాలజీ, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ..

రోబోట్లు అనగానే అచ్చంగా మెకానికల్ గా పని చేసే మర మనుషులు మాత్రమే కాదు. కంప్యూటర్ టెక్నాలజీ, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి రోబోట్లను మరింత సమర్ధవంతంగా తయారు చేయడానికి దోహదం చేస్తోంది.

మనుషులకు పోటీగా, మనుషుల కంటే మిన్నగా

మనుషులకు పోటీగా, మనుషుల కంటే మిన్నగా

మర మనుషులను సాఫ్ట్ వేర్ ను జమిలిగా ఉపయోగించి మనుషులకు పోటీగా, మనుషుల కంటే మిన్నగా కూడా రోబోట్లను తయారు చేయగల పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.

మెదడు ఉపయోగించి చేసే పనులకు కూడా రోబోట్లను అభివృద్ధి
 

మెదడు ఉపయోగించి చేసే పనులకు కూడా రోబోట్లను అభివృద్ధి

సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కొత్త కొత్త పుంతలను తొక్కుతున్న నేపధ్యంలో రోబోట్లు శారీరక శ్రమల స్ధానంలో మాత్రమే ప్రవేశపెట్టే పరిస్ధితి కాదు. మెదడు ఉపయోగించి చేసే పనులకు కూడా రోబోట్లను అభివృద్ధి చేస్తున్నారు. జర్మనీ ఈ రంగంలో అన్ని దేశాలకంటే ముందున్నట్లు సమాచారం.

ఆపీసు పనులు

ఆపీసు పనులు

ఉదాహరణకి ఆఫీసులో కూర్చొని చేసే పనులను కూడా రోబోట్లు చేయగల పరిస్ధితి వస్తోంది.

కార్మికులు, పాలనా సిబ్బంది స్ధానంలో రోబోట్లు

కార్మికులు, పాలనా సిబ్బంది స్ధానంలో రోబోట్లు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యాధునిక కార్ల కంపెనీలు వోక్స్ వ్యాగన్, బి.ఎం.డబ్ల్యూ లు తమ కార్మికులు, పాలనా సిబ్బంది స్ధానంలో రోబోట్లు ప్రవేశపెట్టే శక్తివంతమైన అల్గారిధమ్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ఆధునికమైన యంత్రాలలో మానవ మెదడును తలదన్నే సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టి మనుషుల కంటే వేగంగా, సమర్ధవంతంగా పని చేయించగల పరిజ్ఞానాన్ని ఈ కంపెనీలు అభివృద్ధి చేశాయి.

అధ్కయనం చేసిన కంపెనీ

అధ్కయనం చేసిన కంపెనీ

అధ్యయనం ఒక్క జర్మనీకి మాత్రమే పరిమితం కాలేదు. ఫిన్లాండ్, నెదర్లాండ్స్... ఇంకా ఇతర యూరోపియన్ దేశాలలోనూ అధ్యయనం జరిగింది.

ఘోరమైన స్ధాయిలో ఉపాధి కోల్పోయే పరిస్ధితి జర్మనీలోనే

ఘోరమైన స్ధాయిలో ఉపాధి కోల్పోయే పరిస్ధితి జర్మనీలోనే

అయితే వాటన్నింటిలోనూ అత్యంత ఘోరమైన స్ధాయిలో ఉపాధి కోల్పోయే పరిస్ధితి జర్మనీలోనే ఉన్నదని అధ్యయనం తెలిపింది. శక్తివంతమైన పారిశ్రామిక రంగం జర్మనీ కలిగి ఉండడమే దానికి ప్రధాన కారణం.

అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను కూడా రోబోట్లే

అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను కూడా రోబోట్లే

జర్మనీలో చివరికి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను కూడా రోబోట్లే నిర్వహించనున్నాయి. సెక్రటరీ, సెక్రటరీ తరహా పోస్టులలో దాదాపు అన్నింటినీ రోబోట్లు ఆక్రమిస్తాయని అధ్యయనం తేల్చింది.

శారీరక శ్రమల రంగంలో 2/3 వంతు

శారీరక శ్రమల రంగంలో 2/3 వంతు

మెకానిక్కులు, మెషీన్ డ్రైవర్లు, మెకానికల్ టెక్నీషియన్లు మొదలైన శారీరక శ్రమల రంగంలో 2/3 వంతు ఉపాధిని రోబోట్లు లాగేసుకుంటాయి.

డాక్టర్లు, లెక్చరర్లు లాంటి వారి ఉపాధికి వచ్చిన భయం ఏమీ లేదు

డాక్టర్లు, లెక్చరర్లు లాంటి వారి ఉపాధికి వచ్చిన భయం ఏమీ లేదు

అయితే డాక్టర్లు, లెక్చరర్లు లాంటి వారి ఉపాధికి వచ్చిన భయం ఏమీ లేదని తెలుస్తోంది. డాక్టర్ల పనిని రోబోట్లు ఎలాగూ చేయలేవు. విద్యా రంగంలో 4 మిలియన్ల మంది ఉపాధి పొందుతుండగా వారిలో అర మిలియన్ మాత్రమే ఉపాధి కోల్పోవచ్చు.

160,000 మంది ఉపాధి కోల్పోతారని అధ్యయనం

160,000 మంది ఉపాధి కోల్పోతారని అధ్యయనం

వ్యాపార రంగంలో ఉన్నత స్ధానాల్లో ఉన్నవారికి కూడా రోబోట్ల వల్ల పెద్దగా భయం లేదుట. ఈ స్ధానాల్లో ఉన్న 1.4 మిలియన్ ఉద్యోగుల్లో 160,000 మంది ఉపాధి కోల్పోతారని అధ్యయనం అంచనా వేసింది.

రోబోట్ల వల్ల ప్రభావితం కానీ రంగమే లేదు

రోబోట్ల వల్ల ప్రభావితం కానీ రంగమే లేదు

అయితే గియితే తక్కువ మంది ఉపాధి కోల్పోవడమే తప్ప అసలు రోబోట్ల వల్ల ప్రభావితం కానీ రంగమే లేదని అధ్యయనంలోని అంశాలను బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే ఆరంభం

ఇప్పటికే ఆరంభం

అధ్యయన నివేదికను రూపొందించిన కారస్టెన్ బ్రిజెస్కీ ప్రకారం మానవ ఉపాధిని రోబోట్లు స్వాధీనం చేసుకునే క్రమం ఇప్పటికే ఆరంభం అయిపోయింది. "టేకోవర్ ఇప్పటికే మొదలైంది. రోబోట్లే పూర్తి ఉపాధిని ఆక్రమించిన పారిశ్రామిక రంగాలు ఇప్పటికే ఉనికిలోకి వచ్చాయి" అని బ్రిజెస్కీ తెలిపాడు.

ఆసియాలో కూడా రోబోట్ టెక్నాలజీ

ఆసియాలో కూడా రోబోట్ టెక్నాలజీ

ఆసియాలో కూడా రోబోట్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోందని అధ్యయనం తెలిపింది. అయితే ఇది జపాన్, చైనాల లోనే ప్రధానంగా కేంద్రీకృతం అయి ఉంది.

రోబోట్ సెక్రటరీలు

రోబోట్ సెక్రటరీలు

ఉదాహరణకి తోషీబా కంపెనీ అచ్చం మనుషులు లాగానే కనపడే రోబోట్లను సెక్రటరీ పోస్టుల కోసం అభివృద్ధి చేసింది. గత ఏప్రిల్ నెల నుండి అవి పనిలోకి చేరిపోయాయి కూడాను. టోక్యోలోని తోషిభా కంపెనీ ప్రధాన స్టోర్ లో కస్టమర్లను ఆహ్వానిస్తూ, వారికి కావలసిన సమాచారం అందిస్తూ రోబోట్ సెక్రటరీలు పని చేస్తున్నారు.

మానవ సమాజం మాత్రం వాటివల్ల లబ్ది పొందలేదు.

మానవ సమాజం మాత్రం వాటివల్ల లబ్ది పొందలేదు.

రోబోట్ల నిర్వహణకు కూడా మనుషులు కావాలి గనుక ఆ రంగంలో కొత్త ఉపాధి సృష్టించబడుతుందని అధ్యయనం ఊరడించింది. మర మనుషుల చేతనే అన్నీ పనులు చేయించగల సామర్ధ్యం మనిషికి వస్తే అది ఉన్నత సాంకేతిక పరిజ్ఞానానికి తార్కాణం కావచ్చు గానీ మానవ సమాజం మాత్రం వాటివల్ల లబ్ది పొందలేదు.

అంతిమ ఫలితం పొందేది కంపెనీల యజమానులు మాత్రమే

అంతిమ ఫలితం పొందేది కంపెనీల యజమానులు మాత్రమే

రోబోట్ల వల్ల అంతిమ ఫలితం పొందేది కంపెనీల యజమానులు మాత్రమే. అనగా సంపదల కేంద్రీకరణ మరింత తీవ్రమై, ప్రజలు అధిక సంఖ్యలో ఉపాధి కోల్పోయి సామాజిక రుగ్మతలు మరింతగా విస్తరించే ప్రమాదం పొంచి ఉంటుంది.

కొన్ని భావాలను సైతం వ్యక్తం చేస్తోంది

కొన్ని భావాలను సైతం వ్యక్తం చేస్తోంది

హాంగ్ కాంగ్ కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన హాన్ అనే హ్యూమనాయిడ్ రోబోట్ కొన్ని భావాలను సైతం వ్యక్తం చేస్తోంది

మనుషులు ఇచ్చే కమాండ్ ద్వారానే సాధ్యం

మనుషులు ఇచ్చే కమాండ్ ద్వారానే సాధ్యం

ఫ్రబ్బర్ అని పిలిచే ఎలాస్టిక్ పాలిమర్ తో ఈ రోబోట్ చర్మాన్ని తయారు చేశారు. 40 రకాల మోటార్లు (మెదడుకు సంబంధించినవి, యంత్రానికి సంబంధించినవి కావు) ఈ రోబోట్ మొఖంలో అమర్చడం ద్వారా భావ వ్యక్తీకరణను సుసాధ్యం చేశారు. ప్రస్తుతానికి ఈ భావ వ్యక్తీకరణ మనుషులు ఇచ్చే కమాండ్ ద్వారానే సాధ్యం అవుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
A study commissioned by ING-Diba claims that 59 percent of Germany's work force could be replaced by machines and software in the coming decades. The impact on German society is set to be radical.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X