ఏపీ ఫైబర్‌నెట్ సేవలపై పూర్తి సమాచారం, ధర, పన్నులు, ఇంటర్నెట్ వేగం ఇంకా..

By Hazarath
|

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫైబర్‌ నెట్‌ సేవలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు. దీంతో పాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్స్‌ ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్‌ఎస్‌ఓసీ ప్రాజెక్టును సైతం ఆయన ప్రారంభించారు.ఈ సంధర్భంగా ఫైబర్‌నెట్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

 

6జిబి ర్యామ్, 6080mAh బ్యాటరీ, ఫోన్ కేక బాసూ !6జిబి ర్యామ్, 6080mAh బ్యాటరీ, ఫోన్ కేక బాసూ !

డిజిటల్ ఇండియా పిలుపులో భాగంగా ..

డిజిటల్ ఇండియా పిలుపులో భాగంగా ..

ప్రధాని మోడీ ఇచ్చిన డిజిటల్ ఇండియా పిలుపులో భాగంగా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఏపీ ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. ఫైబర్‌ టు ద హోమ్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) పద్ధతిలో టెలిఫోన్‌, ఇంటర్‌నెట్‌, కేబుల్‌ టీవీ రూ.149కే ముఖ్యమంత్రి అందుబాటులోకి తెచ్చారు.

నెలకు రూ.149 చెల్లించడం ద్వారా..

నెలకు రూ.149 చెల్లించడం ద్వారా..

నెలకు రూ.149 చెల్లించడం ద్వారా టెలిఫోన్‌ కనెక్షన్‌, 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, 250 టీవీ చానళ్లను అందించనున్నారు. ఈ సంధర్భంగా ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు ఓ రికార్డు అని, రాబోయే రోజుల్లో టెక్నాలజీలో భారత్‌కే కాకుండా మొత్తం ప్రపంచానికే ఏపీ ఒక నమూనాలా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు.

సెట్ టాప్ బాక్సు ఖరీదు రూ.99
 

సెట్ టాప్ బాక్సు ఖరీదు రూ.99

గృహ వినియోగదారులకే కాకుండా వ్యాపారం వాణిజ్యం సేవలకు ఈ ఫైబర్ నెట్ సేవలు అందుతాయి. అయితే వినియోగదారులు సెట్ టాప్ బాక్సును రూ.99తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఇంటర్నెట్, టెలిఫోన్, 250 టీవీ ఛానళ్ల సేవలు అందుతాయి.

ఇంటి కనెక్షన్ల కోసం నెలకు రూ.235..

ఇంటి కనెక్షన్ల కోసం నెలకు రూ.235..

ఇంటి కనెక్షన్ల కోసం వినియోగదారులు నెలకు రూ.235 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.149 ఛార్జీ, రూ. 35-36 పన్నులు, రూ. 50 ట్రిపుల్ ప్లే బాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ ఉంటాయి. అయితే రూ. 149లో 110 రూపాయలు కేబుల్ ఆపరేటర్లకు, 39 రూపాయలు ప్రభుత్వానికి వెళ్లనుందని సమాచారం.

ఇంటికి ఇచ్చే కనెక్షన్లను మూడు భాగాలుగా..

ఇంటికి ఇచ్చే కనెక్షన్లను మూడు భాగాలుగా..

ఇంటికి ఇచ్చే కనెక్షన్లను మూడు భాగాలుగా విభజించారు. బేసిక్ రూ. 149, స్టాండర్డ్ రూ. 399, ప్రీమియం రూ. 599లుగా ఇవి అందుబాటులో ఉంటాయి. వీటికి పన్నులు ఇన్‌స్టాల్‌మెంట్ అదనం. ఇప్పుడు ఇస్తున్న బేసిక్ రూ. 149లో 250 టీవీ ఛానళ్లు ( 90 పే ఛానళ్లు మిగతావి ఫ్రీ చానళ్లు) , 15ఎంబిపిఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్, 1 ఎంబిపిఎస్ తో అపరిమిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు.

వాస్తవ వ్యయం రూ.4,700 కోట్లు

వాస్తవ వ్యయం రూ.4,700 కోట్లు

కాగా ఈ ప్రాజెక్టు వాస్తవ వ్యయం రూ.4,700 కోట్లు అవుతుందని అంచనా వేయడం జరిగింది..దీంతో పాటు ఫైబర్‌ కేబుల్‌ను భూగర్భంలో వేసేందుకు వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.

రూ.330 కోట్లకే పూర్తి ..

రూ.330 కోట్లకే పూర్తి ..

అయితే ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రూ.330 కోట్లకే పూర్తి చేసామని చెబుతోంది. అప్పటికే ఉన్న విద్యుత్తుస్తంభాలను ఉపయోగించుకుని వాటిపైన ఫైబర్‌నెట్‌ తీగలు లాగే ఆలోచనకు పదును పెట్టి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసామని అధికారులు చెబుతున్నారు.

ప్రతి గ్రామ పంచాయితీకి ఇంటర్నెట్ సౌకర్యం..

ప్రతి గ్రామ పంచాయితీకి ఇంటర్నెట్ సౌకర్యం..

కాగా ప్రతి గ్రామ పంచాయితీకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.860 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని ఈ డబ్బుతో ప్రతి గ్రామంలో హాట్‌‌స్పాట్‌ ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తామని ఏపీ సీఎం తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌..

ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌..

కాగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు గూగుల్‌ ఎక్స్‌తో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం చేసుకుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎఫ్‌ఎస్‌వోసీ టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలోని పాడేరు, అరకు లాంటి మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ సేవలును అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

 

 

ప్లాన్లు ఇవే

ప్లాన్లు ఇవే

ఏపీ పైబర్ నెట్ కి సంబంధించిన మూడు విభాగాల ప్లాన్లు ఇవే ..

Best Mobiles in India

English summary
AP Fiber Grid Plans Starts at Rs 149; Provides Broadband, Television, and Telephone Services in a Single Package

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X