ఇంటెల్ అతి పెద్ద డీల్

Written By:

అమెరికాకు చెందిన కంప్యూటర్ చిప్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ డ్రైవర్‌ లెస్‌ కారును అందుబాటులోకి తెచ్చే యోచనలో భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఇజ్రాయిల్‌ కంప్యూటర్ కంపెనీ మొబైల్ ఐ కంపెనీని కొనుగోలు చేసింది. డ్రైవర్‌ లెస్‌ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న మొబైల్‌ ఐ ని 15 బిలియన్ డాలర్లకు (దాదాపు లక్షలకోట్ల రూపాయలు) కి సొంతం చేసుకోనుంది.

ఇకపై ఐడియా రోమింగ్ ఉచితం

ఇంటెల్ అతి పెద్ద డీల్

ఈ మేరకు ఇరు సంస్థలు సోమవారం ఒక ప్రకటన జారీ చేశాయి. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ ఒప్పందం పూర్తికానుందని తెలిపాయి. తమ వాటాదారులకు,ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది గొప్పముందడుగు అని ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిచ్‌ తెలిపారు. డ్రైవింగ్ లెస్‌ కారు ఆవిష్కరణను వేగవంతం చేయనున్నట్టు చెప్పారు.

1000 జిబి డేటా, 10 జిబిపిఎస్ స్పీడ్, జియో సంచలనం

ఇంటెల్ అతి పెద్ద డీల్

ఈ ప్రక్రియలో ఇంటెల్‌ కీలకమైన, పునాది సాంకేతికలను అందిస్తోంటే, మొబైల్‌ ఐ పరిశ్రమకు ఉత్తమ ఆటోమోటివ్ గ్రేడ్ కంప్యూటర్ విజన్ అందిస్తోంది. దీంతో ఇకముందు తమ భాగస్వామ్యంలో తక్కువ ఖర్చుతో, మెరుగైన ప్రదర్శనతో క్లౌడ్ టు-కారు సొల్యూషన్‌ తో భవిష్యత్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను మరింత వేగంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.

షాకింగ్ ఫీచర్లతో నోకియా 8, కొత్తవి ఇవే !

ఇంటెల్ అతి పెద్ద డీల్

ప్రముఖ కార్ల ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, ఎస్‌టీ మైక్రో ఎలక్ట్రానిక్స్‌తో తమ సంబంధాలు యధావిథిగా కొనసాగుతాయని మొబైల్‌ ఐ ప్రకటించింది. ప్రస్తుత ఉత్పత్తి లో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.

English summary
Intel to acquire driverless car tech firm - Mobileye read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot