ట్రంప్‌పై పోరాటం, చరిత్రలో తొలిసారిగా ఏకమైన టెక్ దిగ్గజాలు

Written By:

ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై వీసా నిషేధాన్ని, వలస విధానాలపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తొలిసారిగా కార్పోరేట్ కంపెనీలు ఏకమయ్యాయి. గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఉబెర్ లాంటి సంస్థలన్నీ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా లేఖ రాయనున్నాయి. అయితే పెద్ద కంపెనీలన్నీ కలిసికట్టుగా ముందుకు నడవడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

గూగుల్ క్రోమ్‌కి పోటీగా మైక్రోసాప్ట్ నుంచి కొత్త ఓఎస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిలికాన్‌ వ్యాలీలో నిరసనల తీవ్రత

వీసా నిషేధంపై గత వారం రోజులుగా అమెరికన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. వలస కుటుంబాలు నెలకొల్పిన కంపెనీలతో నిండిపోయిన సిలికాన్‌ వ్యాలీలో నిరసనల తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలూ

సర్జీ బ్రిన్, టిమ్ కుక్, మార్క్ జుకెర్‌బర్గ్ సహా పలు కార్పొరేట్ అధినేతలు ట్రంప్ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలూ అధ్యక్షుడి నిర్ణయంపై మండిపడ్డాయి.

టిమ్ కుక్ మాట్లాడుతూ

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ వలసలు లేకుండా ఆపిల్ కంపెనీనే లేదని, ట్రంప్ వలస విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. దీనిపై కలిసికట్టుగా గొంతు వినిపించాలంటూ పిలుపునిచ్చారు.

జుకెర్‌బర్గ్ మాట్లాడుతూ

ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ మాట్లాడుతూ ట్రంప్ నిర్ణయంపై మీలో చాలామందిలాగే నేనూ ఆందోళన చెందుతున్నాను. శరణార్థుల కోసం ఎవరు ఎలాంటి సహాయం కోరినా చేసేందుకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

సుందర్ పీచాయ్ మాట్లాడుతూ

గూగుల్ సీఈవో సుందర్ పీచాయ్ మాట్లాడుతూ ఈ ఆదేశాల వల్ల కలిగే ప్రభావంతో పాటు గూగుల్ అభిమానులు, వారి కుటుంబాలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.

ట్విటర్, ఎయిర్ బీఎన్‌బీ వంటి కంపెనీలు

ఇక ట్విటర్, ఎయిర్ బీఎన్‌బీ వంటి కంపెనీలు కూడా శరణార్థులకు అండగా ఉంటామని ముందుకొచ్చాయి. వారికోసం ఎందాకైనా పోరాడతామంటూ పిలుపునిచ్చాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Apple, Google, Facebook, Uber, Twitter and others draft a joint letter opposing Trump's immigration read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot