భారత్‌ని కలవరపెడుతున్న 4G స్పీడ్, ప్రపంచంలోనే అట్టడుగు స్థానం !

Written By:

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో దేశంలో టెలికా రంగంలో సరికొత్త విప్లవం మొదలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటిదాకా 3జీ మీద కాలం వెళ్లదీస్తున్న భారత్ రిలయన్స్ జియో రాకతో 4G మీదకు దూసుకొచ్చింది. ఇప్పుడు అంతే వేగంతో 5జీ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ప్రపంచ దేశాలు భారత్ కన్నా ముందు వరసలో 4G స్పీడ్ లో దూసుకుపోతున్నయానే కఠిన వాస్తవాలు కొంచెం నిరాశకు గురిచేస్తున్నాయి. భారత 4G స్పీడులో అట్టడుగు స్థానంలో ఉందంటూ తాజాగా ఓ కంపెనీ వెల్లడించింది.

శాంసంగ్ 20-20 కార్నివాల్, డిస్కౌంట్లు, ముంబై ఇండియన్స్‌ జెర్సీ మీ సొంతం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతర్జాతీయంగా 4జీ స్పీడ్..

వైర్‌లెస్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్‌సిగ్నల్ 4G స్పీడ్ మీద కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అంతర్జాతీయంగా 4జీ స్పీడ్ చూసుకుంటే మాత్రం ఇండియా ఇప్పటికీ ఎంతో వెనుకబడే ఉందని ఓపెన్‌సిగ్నల్ కంపెనీ స్పష్టంచేసింది.

సగటు స్పీడ్ 9.3 ఎంబీపీఎస్

అంతర్జాతీయ సగటు స్పీడ్ మాత్రం 16.9 ఎంబీపీఎస్‌గా ఉండగా ఇండియాలో కేవలం సగటు స్పీడ్  9.3 ఎంబీపీఎస్ గా ఉందని తెలిపింది. ఈ స్పీడ్ ను అందిస్తున్న కంపెనీ భారతి ఎయిర్టెల్ అని తెలిపింది. కాగా 4G స్పీడ్‌ను అంచనా వేసిన 88 దేశాల్లో భారత్ అట్టడుగున ఉంది.

జియో భారతి ఎయిర్‌టెల్ కన్నా వెనకనే...

డిసెంబర్ 1, 2017 నుంచి ఫిబ్రవరి 28, 2018 మధ్యకాలంలో మొత్తం 7,36,571 డివైస్‌లను పరీక్షించి ఓపెన్ సిగ్నల్ కంపెనీ ఈ డేటాను సేకరించింది. ఈ కంపెనీ అందించిన వివరాల ప్రకారం ఇండియాలో 4జీ స్పీడులో రిలయన్స్ జియో భారతి ఎయిర్‌టెల్ కన్నా వెనకనే ఉందని తెలిపింది.

ఓవరాల్ డౌన్‌లోడ్ స్పీడ్స్‌లో రిలయెన్స్ జియోను ఎయిర్‌టెల్ మించిపోయినట్లు వైర్‌లెస్

3జీ, 4G నెట్‌వర్క్ స్పీడ్స్, ఓవరాల్ డౌన్‌లోడ్ స్పీడ్స్‌లో రిలయెన్స్ జియోను ఎయిర్‌టెల్ మించిపోయినట్లు వైర్‌లెస్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్‌సిగ్నల్ వెల్లడించింది. అయితే జియో 4జీ యాక్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఓవరాల్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్‌కు చాలా దగ్గరగా వచ్చిందని తెలిపింది.

4జీ అవైలబిలిటీ విషయంలో..

జియో ప్రతి రోజూ డౌన్‌లోడ్ స్పీడ్ 5.1 ఎంబీపీఎస్ ఉండగా.. ఎయిర్‌టెల్ స్పీడ్ 6 ఎంబీపీఎస్‌గా ఉంది. 4జీ అవైలబిలిటీ విషయంలో మాత్రం ప్రత్యర్థులందరి కంటే ఎంతో ముందే ఉంది జియో. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలతో పోల్చుకుంటే కనీసం 27 శాతం పాయింట్లు ముందు ఉంది.

ఎల్‌టీఈ సిగ్నల్ 96.4 శాతం..

జియో ఎల్‌టీఈ సిగ్నల్ 96.4 శాతం కొన్ని సమయాల్లో అందుబాటులోనే ఉంటున్నదని ఓపెన్‌సిగ్నల్ చెప్పింది. కేవలం 4జీ నెట్‌వర్క్‌నే ప్రమోట్ చేయాలనుకుంటున్న జియో.. ఆ దిశగా 4జీ అవైలబిలిటీని పెంచుతున్నదని తెలిపింది. దేశంలో దాదాపు 85% LTE నెట్ వర్క్ లో ముందుకెళుతోందని అత్యున్నత పెర్ఫార్మెన్స్ తో Sweden, Taiwan and Australia లాంటి దేశాల సరసన చేరిందని ఈ కంపెనీ తెలిపింది.

ఐడియా, వొడాఫోన్‌ల 4జీ స్పీడ్ మాత్రం ..

ఇక ఐడియా, వొడాఫోన్‌ల 4జీ స్పీడ్ మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bharti Airtel beats Reliance Jio in 4G speeds: OpenSignal More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot