ఆంధ్రా కంపెనీ పై బిట్‌కాయిన్ చీటింగ్ కేసు నమోదు

|

బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజ్ అలానే వాలెట్ సర్వీసులను అందిస్తోన్న ఓ ఆంధ్రా కంపెనీ తనను మోసం చేసిందంటూ గజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. గుర్‌గావ్‌కు చెందిన కంపెనీలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అనూజ్ గార్గ్ గతేడాది నవంబర్‌లో ఓ బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజ్ మొబైల్ అప్లికేషన్‌ను తన స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 
ఆంధ్రా కంపెనీ పై బిట్‌కాయిన్ చీటింగ్ కేసు నమోదు

ఆ తరువాత నుంచి అప్లికేషన్ ద్వారా క్రిప్టోకరెన్సీ ఫార్మాట్‌లో లావాదేవీలను నిర్వహించుకోవటం స్టార్ట్ చేసారు. అయితే కొద్ది రోజుల క్రితం ఉన్నట్టుండి తన యాప్ అకౌంట్ సస్పెండ్ అవటంతో పాటు మొబైల్ వాలెట్‌లోని 7 లక్షల డబ్బు కూడా మాయమైపోయిందిని గార్గ్ ఆరోపించారు.

డిసెంబర్ 26న గజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు..

డిసెంబర్ 26న గజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు..

అకౌంట్ సస్పెండ్ అవటంతో పాటు వాలెట్‌లోని నగదు మొత్తం మాయమైపోవటంతో తీవ్ర షాక్‌కు గురైన అనూజ్ డిసెంబర్ 18న ఢిల్లీ ఎకనమిక్ అఫెన్సెస్‌ వింగ్‌ను ఆశ్రయించటంతో పాటు డిసెంబర్ 26న గజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితుని ఫిర్యాదు మేరకు బిట్ కాయిన్ ఇండియా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ పై కేసు నమోదు చేసిన గజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

బాధితులు నాతో టచ్‌లో ఉన్నారు..

బాధితులు నాతో టచ్‌లో ఉన్నారు..

ఈ కంపెనీ చేతిలో మోసపోయిన చాలా మంది బాధితులు సోషల్ మీడియా ద్వారా తనను సంప్రదించారని బాధితుడు ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బాధితుల్లో ఒకరైన మోహిత్ పునియా ఇదే కంపెనీ చేతిలో దాదాపు 50 లక్షలకు మోసపోయారని అనూజ్ గార్గ్ తెలిపారు.

ఈ కంపెనీ చేతిలో గతంలో మోసపోయిన వారికి జరిగినట్లుగానే తనకు కూడా అకౌంట్ సస్పెండ్ అయ్యిందని అనూజ్ ఆరోపించారు. బిట్‌కాయిన్ ఇండియా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు సైకం రామక్రష్ణా రెడ్డి అధినేతగా వ్యవహరిస్తున్నారు.

సగానికి పైగా తగ్గిన ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చుసగానికి పైగా తగ్గిన ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చు

ఎటువంటి మోసాలకు పాల్పడలేదు, లీగల్ ఛాలెంజ్‌కు సిద్ధం
 

ఎటువంటి మోసాలకు పాల్పడలేదు, లీగల్ ఛాలెంజ్‌కు సిద్ధం

తమ సంస్థ పై వచ్చిన ఆరోపణలన్నింటిని బిట్‌కాయిన్ ఇండియా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఖండించింది. కంపెనీ టర్మ్స్ అండ్ కండీషన్స్ ఆధారంగానే తాము నడుచుకున్నామని, తాము ఎటువంటి మోసానికి పాల్పడలేదని సంస్థ సీఈఓ రామక్రిష్ణా రెడ్డి తెలిపారు.

తమది మొబైల్ వాలట్ మాత్రమేనని, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కాదని ఎవరైనా డేటా దుర్వినియోగానికి పాల్పడినట్లయితే వాటి అకౌంట్లను టెర్మినేట్ చేసే హక్కు తమకు ఉంటుందని అన్నారు. తమ సంస్థ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తాము ఎటువంటి లీగల్ ఛాలెంజ్‌నైనా ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

రోజురోజుకు పెరిగిపోతోన్న బిట్‌కాయిన్ విలువ

రోజురోజుకు పెరిగిపోతోన్న బిట్‌కాయిన్ విలువ

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన వర్చువల్ కరెన్సీలో బిట్ కాయిన్ ఒకటి. బిట్‌కాయిన్ విలువ రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ క్రిప్టోకరెన్సీ పట్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆసక్తి నెలకుంది. 2017 అక్టోబర్ నుంచి బిట్‌కాయిన్ విలువ అమాంతం పెరుగుతూ వస్తోంది. ఓ దశలో 18,700 డాలర్లకు చేరుకున్న బిట్‌కాయిన్ విలువ ప్రస్తుతం 15079 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది. ఈ కరెన్సీకి బ్యాంకులతో, ప్రభుత్వాలతో అస్సలు సంబంధం ఉండదు. మైనింగ్ పద్ధతిలో శక్తివంతమైన సూపర్ కంప్యూటర్స్ ద్వారా వీటిని సృష్టిస్తారు.

అంతా ఓ మిస్టరీ..

అంతా ఓ మిస్టరీ..

జపాన్‌కు చెందిన సతోషి నకమొటోను బిట్‌కాయిన్ సృష్టికర్తగా భావిస్తున్నారు. కానీ అతనెవరో ఎవరికీ తెలియదు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ క్రెయిట్ వైట్ బిట్‌కాయిన్ల గురించి పదేపదే ఇంటర్వ్యూలు ఇస్తూ తానే నకమోటో అని చెప్పుకుంటున్నారు. ఒక బిట్‌కాయిన్ 34 అల్ఫాన్యూమరిక్ క్యారక్టర్లను కలిగి ఉంటంది. వీటిని ఎవరు పంపుతున్నారు, ఎవరి వద్దకు వెళుతున్నాయ్ అనేది తెలుసుకోవటం చాలా కష్టం. దీంతో అక్రమ లావాదేవీలకు ఈ బిట్‌కాయిన్‌లను ఎక్కువుగా వినియోగిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Bitcoin account-holder alleges Andhra firm duped him of Rs 7 lakh. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X