రోజుకు 33GB డేటా కొత్త ప్లాన్ తో జియోఫైబర్ కు సవాల్ విసిరిన BSNL

|

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియో టేబుల్‌కు కొత్తగా 1,999 రూపాయల ప్లాన్‌ను జోడించి విస్తరించింది. జియోఫైబర్ ప్రణాళికలను ప్రకటించిన వెంటనే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కొత్తగా 1,999 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇది రోజువారీగా 33GB డేటాను మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

 

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

ఇప్పటి వరకు బిఎస్‌ఎన్‌ఎల్ తన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికల జాబితాలో రూ.849, రూ .1,277, రూ .2,499, రూ .4,499, రూ .5,999, రూ .9,999, రూ .16,999 ప్రణాళికలను అందించింది. బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి వస్తున్న రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ACT ఫైబర్‌నెట్, ఎయిర్‌టెల్ వి-ఫైబర్ యొక్క రూ.1,999 ప్లాన్‌ ఆదారంగా తీసుకున్నది. అలాగే జియో ఫైబర్ అందిస్తున్న 2,499 రూపాయల ప్లాన్ కు సమానంగా ఈ ప్లాన్ తన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 33 జిబి వరకు డేటాను 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో అందిస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ ధృవీకరించింది తరువాత దీని యొక్క వేగం 4 ఎమ్‌బిపిఎస్‌కు తగ్గించబడుతుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.19999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు
 

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.19999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ప్రారంభించిన ప్లాన్‌కు సంబందించిన విషయానికి వస్తే ఇది ప్రతిరోజూ వినియోగదారుకు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 33 జిబి వరకు డేటాను అందిస్తుంది. రోజువారీ FUP తరువాత దీని యొక్క వేగం 4 Mbps కు తగ్గించబడుతుంది. ఇది జియోఫైబర్ అందిస్తున్న FUP తర్వాత డేటా స్పీడ్ 1 Mbps తో పోలిస్తే చాలా గొప్పది. BSNL యొక్క ఈ ప్రణాళిక అపరిమిత డేటా ప్లాన్‌గా మార్కెటింగ్ చేస్తున్నప్పటికీ ఇతర భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మాదిరిగానే రోజువారీ 33GB డేటా క్యాప్ ఉంది. తెలియని వారి కోసం, బిఎస్ఎన్ఎల్ ఈ సంవత్సరం ప్రారంభంలో తన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను సవరించింది మరియు వాటిని రోజువారీ డేటా ప్లాన్లుగా మార్చింది.

ల్యాండ్‌లైన్

1,999 రూపాయల భారత్ ఫైబర్ ప్లాన్ డేటాను అందించడంతో పాటు సంస్థ యొక్క ల్యాండ్‌లైన్ సర్వీస్ ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్లాన్ BSNL నుండి వచ్చిన మంచి ప్రణాళిక అవుతుంది కానీ డేటా యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలో PSU 250 ఎమ్‌బిపిఎస్ వేగాన్ని అందించాలి. అయినప్పటికీ ప్రీమియం రూ.16,999 భారత్ ఫైబర్ ప్లాన్‌తో కూడా బిఎస్‌ఎన్‌ఎల్ అందించే గరిష్ట వేగం 100 ఎమ్‌బిపిఎస్.

BSNLభారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న ప్రణాళికలు

BSNLభారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న ప్రణాళికలు

1,999 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టడంతో బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఇప్పుడు మొత్తం ఎనిమిది భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 100 ఎమ్‌బిపిఎస్ డేటా వేగాన్ని అందిస్తున్నాయి.మొదటిది రూ .849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 600 జిబి వరకు 50 ఎమ్‌బిపిఎస్ వేగాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో యూజర్లు 2 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ వద్ద బ్రౌజ్ చేయవచ్చు. మరొకటి రూ.1,277 భారత్ ఫైబర్ ప్లాన్ ఇది వినియోగదారునకు 100 Mbps వేగంతో 750GB డేటాను మరియు FUP వేగంతో 2 Mbps ను అందిస్తుంది.

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న మరొక ప్లాన్ రూ .2,499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇది 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 40 జిబి డేటాను మరియు ఎఫ్‌యుపి వేగం తరువాత 4 ఎమ్‌బిపిఎస్‌ వేగంతో అందిస్తుంది. అలాగే రూ.4,499 ప్లాన్ కూడా 55 జీబీ డైలీ డేటాను అందిస్తుంది. రూ.5,999 ప్లాన్‌లో 80 జీబీ డైలీ క్యాప్ ఉంటుంది. రూ.9,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యూజర్‌కు 120 జీబీ డైలీ డేటాను అందిస్తుంది. చివరగా రూ.16,999 ప్లాన్ 170 జీబీ డైలీ డేటాతో వస్తుంది. పైన పేర్కొన్న అన్ని బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్లు అపరిమిత వాయిస్ కాలింగ్ సర్వీస్ ను అందిస్తాయి.

జియో ఫైబర్ రూ.2,499 ప్లాన్ VS బిఎస్ఎన్ఎల్ రూ.19999 భారత్ ఫైబర్ ప్లాన్

జియో ఫైబర్ రూ.2,499 ప్లాన్ VS బిఎస్ఎన్ఎల్ రూ.19999 భారత్ ఫైబర్ ప్లాన్

రిలయన్స్ జియో మొత్తంగా ఆరు జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను 100 ఎమ్‌బిపిఎస్ బేస్ స్పీడ్స్ మరియు 1 Gbps గరిష్ట వేగాన్ని అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు ప్రవేశపెట్టిన రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు దగ్గర పోలికలో జియోఫైబర్‌ యొక్క రూ.2,499 ప్లాన్ ఉంది. జియోఫైబర్ యొక్క రూ.2,499 ప్లాన్‌తో జియో 500 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో 500 జిబి వరకు డేటాను అందిస్తుంది. దాని తరువాత 1 ఎమ్‌బిపిఎస్ వేగంతో పరిమితి లేకుండా డేటాను అందిస్తోంది. జియో టివి కాలింగ్ సర్వీస్ తో పాటు 4 K సెట్-టాప్ బాక్స్ మరియు ల్యాండ్‌లైన్ వాయిస్ కాలింగ్ సెటప్‌ను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Broadband Plan: 33GB Daily Data and Unlimited Calling at Rs 1,999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X