సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన BSNL

|

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఇప్పుడు పోటీ మరింత ఎక్కువ అయింది. పోటీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కొత్త ప్లాన్‌లను విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ హయాంలోని బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి తన పాత ప్లాన్‌లను మళ్ళి తీసుకువచ్చింది. ఇప్పుడు మరొక కొత్త ప్లాన్‌ సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది.

సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌
 

బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ నెలకు 50 ఎమ్‌బిపిఎస్ వేగంతో 500 జిబి డేటా ప్రయోజనంతో విడుదల చేసింది. ఈ ప్లాన్ హాట్స్టార్ కాంప్లిమెంటరీ సుబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఇది రెండు ఎంపికలలో లభిస్తుంది. మొదటిది డిఎస్ఎల్ ప్లాన్ 10Mbps డేటా వేగంతో వస్తుంది. రెండవది భారత్ ఫైబర్ ప్లాన్ ఇది 50Mbps వేగంతో వస్తుంది. వినియోగదారులు 500GB డేటా FUP ని దాటిన తరువాత ఇంటర్నెట్ వేగం 2Mbps కు తగ్గించబడుతుంది.

బిఎస్‌ఎన్‌ఎల్

బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా అందిస్తున్న సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 500 జిబి నెలవారీ డేటా FUP, ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ మరియు ఉచితంగా కాంప్లిమెంటరీ హాట్‌స్టార్ ప్రీమియం సుబ్స్క్రిప్షన్ ను అందిస్తుంది. ఈ కొత్త సూపర్ స్టార్ 500 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర 949 రూపాయలు.

రోజుకు 33GB డేటా కొత్త ప్లాన్ తో జియోఫైబర్ కు సవాల్ విసిరిన BSNL

హాట్‌స్టార్

హాట్‌స్టార్ యొక్క వార్షిక చందా 999రూపాయలు. ఇది బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు ఉచితంగా అందించబడుతుంది. వాస్తవానికి భారత్ ఫైబర్ వినియోగదారులకు 50Mbps వేగం లభిస్తుంది. అయితే DSL ప్లాన్ వినియోగదారులకు 10Mbps వేగం మాత్రమే లభిస్తుంది. ఈ ప్రణాళిక అండమాన్ మరియు నికోబార్ మినహా అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంటుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ సూపర్ స్టార్ 300 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌
 

బిఎస్‌ఎన్‌ఎల్ సూపర్ స్టార్ 300 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

బిఎస్‌ఎన్‌ఎల్ ఇంతకుముందు సూపర్ స్టార్ 300 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇది 300 జిబి నెలవారీ డేటా ఎఫ్‌యుపి, భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను మరియు కాంప్లిమెంటరీ హాట్‌స్టార్ ప్రీమియం సుబ్స్క్రిప్షన్ లను కూడా అందిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సూపర్ స్టార్ 300 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర 749 రూపాయలు.

 జియోఫైబర్ సిల్వర్ ప్లాన్‌ VS బిఎస్‌ఎన్‌ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్

జియోఫైబర్ సిల్వర్ ప్లాన్‌ VS బిఎస్‌ఎన్‌ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్

ఈ కొత్త బిఎస్‌ఎన్‌ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్ 100mbps డేటా వేగంతో అందించే జియోఫైబర్ యొక్క రూ.849 సిల్వర్ ప్లాన్‌కు సమానంగా ఉంటుంది. జియోఫైబర్ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 200GB డేటా FUP (వెల్కమ్ ఆఫర్‌లో భాగంగా 200GB అదనపు డేటా), ఉచిత వాయిస్ కాలింగ్, 3 నెలల OTT యాప్ సుబ్స్క్రిప్షన్, టీవీ వీడియో కాలింగ్ ఫీచర్, జీరో లేటెన్సీ గేమింగ్ ఫీచర్, హోమ్ నెట్‌వర్కింగ్ ఫీచర్ మరియు ఒక సంవత్సరం నార్టన్ ప్రొటెక్షన్ ఆఫర్‌లతో వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Super Star 500 Broadband Plan Details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X