ఎయిర్‌టెల్ సర్ ప్రైజింగ్ ఆఫర్, ఫ్రీ డేటా..

Written By:

టెలికం రంగంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న భారతి ఎయిర్‌‌టెల్‌ సర్‌ప్రైజింగ్‌ ప్రమోషనల్ ఆఫర్‌ను అందించనుంది. మార్చి 13నుంచి పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులకు ఉచిత డేటా సేవలను అందించనుంది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ యూజర్లకు ఈమెయిల్‌ సమాచారాన్నందిస్తోంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది రాబోతున్న అత్యంత ఖరీదైన ఫోన్లు ఇవే!

ఎయిర్‌టెల్ సర్ ప్రైజింగ్ ఆఫర్, ఫ్రీ డేటా..

మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ వివరాలు స్పష్టం కానున్నాయి. దేశంలోని అత్యంత వేగంగా మొబైల్ నెట్‌ వర్క్‌నుంచి ఈ సేవలను పొందవచ్చని ఎయిర్‌ టెల్‌ ఖాతాదారులకు పంపిన ఈ మెయిల్‌ సమాచారంలో తెలిపింది. అయితే మార్చి 13నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆశ‍్చర్యకరమైన ఆఫర్‌ లో డేటా సేవలు ఏ మేరకు ఉంటాయనేది ఎయిర్‌టెల్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

వాట్సప్‌లో మరో పవర్‌పుల్ ఫీచర్ !

అన్ని కంపెనీల డేటా ఆఫర్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో రూ. 303 ప్లాన్

రూ. 99 రీఛార్జ్ చేసుకున్న ప్రైమ్ యూజర్లు రూ. 303 ప్లాన్ కింది ఉండే అన్ని రకాల బెనిపిట్స్ పొందుతారు. 28 జిబి డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్ ఈ ప్లాన్ ద్వారా వర్తిస్తుంది. అయితే రోజుకు 1 జిబి మాత్రమే జియో ఇస్తుంది.తరువాత డేటా వాడితే స్పీడ్ తగ్గుతుందని తెలిపింది. దీంతో పాటు 5జిబి డేటా అదనంగా కూడా ఇస్తోంది.

వొడాఫోన్ రూ. 342 ప్లాన్

రూ. 342కే 28 జిబి డేటా అంటూ సంచలనం రేపింది. ఈ ప్లాన్ లో మీకు రోజుకు 1జిబి డేటా లభిస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా వర్తిస్తుంది. అలాగే రూ. 346 ప్లాన్ వేసుకుంటే 10 జిబి డేటాతో పాటు రోజుకు 300 నిమిషాల టాక్ టైం ఉచితంగా లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 345 ప్లాన్

రూ. 345కే 28 జిబి డేటాను అందిస్తోంది. ఇది రోజుకు 1జిబి డేటా చొప్పున మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. ఈ 1జిబి డేటా కైడా పగలు 500 ఎంబి రాత్రి 500 ఎంబి లెక్కన వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఐడియా రూ. 345 ప్లాన్

రూ.345 చెల్లించటం ద్వారా 14జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను 28 రోజులు పాటు ఆస్వాదించవచ్చు. రూ.345 ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేయనున్న 14జీబి 4జీ డేటా రోజుకు 500 ఎంబి చొప్పున 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ మళ్లీ దుమ్మురేపింది.

ఎయిర్‌టెల్‌ మళ్లీ దుమ్మురేపింది.. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Airtel postpaid customers to get free data under ‘surprise offer’ starting March 13 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot