100 మెగా పిక్సల్ కెమెరాను వృద్ధి చేసినా చైనా!

Posted By:

100 మెగా పిక్సల్ కెమెరాను వృద్ధి చేసినా చైనా!

ముప్పై కాదు నలభై కాదు ఏకంగా 100 మెగా పిక్సల్ కెమెరాను చైనాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆప్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వృద్ధి చేసింది. ఈ హై రిసల్యూషన్ కెమెరాను ఏరియా మ్యాపింగ్, విపత్తు పర్యవేక్షణ ఇంకా ఇంటెలిజెంట్ రవాణా వ్యవస్థల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ శక్తివంతమైన కెమెరాలకు ఐవోఈ3-కంబన్ ( IOE3-Kanban)గా నామకరణం చేసినట్లు చైనీస్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ (సీఏఎస్) ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కెమెరా చిత్రీకరించే ఫోటోలు 10,240 x 10,240 పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ శక్తివంతమైన కెమెరాలో అధునాతన కెమెరా సిస్టమ్స్, కెమెరా కంట్రోలింగ్ వ్యవస్థ  ఇంకా హై-కెపాసిటీ డేటా రికార్డింగ్ సిస్టంలను నిక్షిప్తం చేసారు. ఇదే సంస్థ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భాగంగా 81 మెగా పిక్సల్ సామర్ధ్యం గల కెమెరాను వృద్ధి చేసింది.

వాసనలు పసిగట్టగలిగే కెమెరా!

అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఇంకా కెమెరా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో ఫ్రెండ్ పుట్టినరోజు వేడుక మొదలకుని అన్ని శుభకార్యాలను కెమెరాలలో బంధించటం సర్వసాధారమైపోయింది. తాజాగారూపొందించబడిన ఓ ప్రత్యేక కెమెరా వ్యవస్థ పోటోతో పాటు అక్కడి వాసనలను సైతం పదిలపరచ గలదు. మీరు వింటున్నది నిజమే. యూకే ప్రాంతంలోని సెంట్రల్ సెయింట్ మార్టిన్స్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ అమీ రాడ్క్లిఫ్ ‘మాడలీన్'( Madeleine) పేరుతో సరికొత్త గాడ్జెట్‌ను డిజైన్ చేయటం జరిగింది.

ఈ ప్రత్యేకమైన సెన్సరీ టెక్నాలజీ వ్యవస్థ.. చిత్రీకరించిన దృశ్యానికి సంబంధించిన పరిమళాన్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేయగలరు. అంటే ఫోటోను చూసినపుడల్లా ఆ పరిమళాన్ని మీరు ఆస్వాదించవచ్చన్నమాట. ఇందుకుగాను కెమెరాలో ప్రత్యేకమైన సెన్సరీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఈ కెమెరాను ఉపయోగించే వ్యక్తి కెమెరాకు అనుసంధానింబడిన సెన్సరీ వ్యవస్థతో కూడిన ప్రత్యేక గొట్టాన్ని చిత్రీకరించే వస్తువు దగ్గర ఉంచాల్సి ఉంటుంది. సదరు పైపు ఆ ప్రాంతంలోని సువాసనలను గ్రహించుకుని ప్రత్యేకమైన ఫార్ములా ఆధారంగా కృత్రిమ సువాసనలను సృష్టించి మీకు అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot