అమరావతి - విజయవాడ మధ్య Hyperloop, ప్రయాణ సమయం 5 నిమిషాలే

భారతదేశంలో హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కుదిరిన మొట్టమొదటి ఒప్పందం ఇదే...

|

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విజయవాడ వరకు హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకుగాను లాంచ్ ఏంజిల్స్‌కు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ (HTT)తో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

గూగుల్ కొత్త ఫీచర్, ఎన్నిసార్లు వీడియోలు చూసినా డేటా కట్ అవ్వదుగూగుల్ కొత్త ఫీచర్, ఎన్నిసార్లు వీడియోలు చూసినా డేటా కట్ అవ్వదు

ప్రయాణ సమయంలో 5 నిమిషాలు కంటే తక్కువే..

ప్రయాణ సమయంలో 5 నిమిషాలు కంటే తక్కువే..

ఈ సూపర్‌ఫాస్ట్ షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ గనుక పూర్తిస్థాయిలో అందుబాటలోకి వచ్చినట్లయితే అమరావతి నుంచి విజయవాడకు 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ప్రయాణించే వీలుంటుంది.

మొదటి ఫేజ్‌లో భాగంగా

మొదటి ఫేజ్‌లో భాగంగా

మొదటి ఫేజ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఆక్టోబర్, 2017 నుంచి 6 నెలల పాటు హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ అధ్యయనం చేయనుంది.

రెండవ ఫేజ్‌లో భాగంగా...

రెండవ ఫేజ్‌లో భాగంగా...

రెండవ ఫేజ్‌లో భాగంగా ప్రాజెక్ట్ పనులు పట్టాలెక్కుతాయి. ఇందకు సంబంధించిన నిధులను ప్రాధమికంగా  ప్రయివేటు  పెట్టుబడుదారల నుంచి సమీకరిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్ట్ పనులు అమరావతి నుంచి ప్రారంభమవుతాయి. భారతదేశంలో హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కుదిరిన మొట్టమొదటి ఒప్పందం ఇదే కావటం విశేషం.

ఎలాన్ మస్క్ ఆలోచనల నుంచి..

ఎలాన్ మస్క్ ఆలోచనల నుంచి..

ప్రయాణికులను నిమిషాల్లో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎలాన్ మస్క్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన హైపర్‌లూప్ అనే క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే వాస్తవరూపాన్ని అద్దుకోబోతోంది. ఈ సరికొత్త రవాణా వ్యవస్థను అమెరికాలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

లాస్ ఏంజిల్స్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకు

లాస్ ఏంజిల్స్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకు

ముందుగా లాస్ ఏంజిల్స్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకు 610 కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను దాదాపు 1600 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఓ ప్రథమిక అంచనా.

హైపర్‌లూప్ క్యాప్సూల్ ఏలా ప్రయాణిస్తుంది?, ఈ వాహనం వేగం ఎంత?

హైపర్‌లూప్ క్యాప్సూల్ ఏలా ప్రయాణిస్తుంది?, ఈ వాహనం వేగం ఎంత?

హైపర్‌లూప్ క్యాప్సూల్, ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్యూబ్ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యాన్ని హైపర్‌లూప్  కలిగి ఉంటుంది. ఈ వాహనం ద్వారా గంటకు ఏడొందల క్యాప్సూల్స్‌ను పంపుతార. క్యాప్సూల్ ఒక్కొక్కటి 28 సీట్ల సామర్ద్యం కలిగి ఉంటుంది.

అత్యంత శక్తివంతమైన ఫ్యాన్‌లను అమర్చడం ద్వారా..

అత్యంత శక్తివంతమైన ఫ్యాన్‌లను అమర్చడం ద్వారా..

ఈ క్యాప్సుల్స్‌కు అత్యంత శక్తివంతమైన ఫ్యాన్‌లను అమర్చడం ద్వారా.. ట్యూబ్ ఈ చివరి దాకా గాలినిరోధాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తారు. తద్వారా క్యాప్సూల్స్ అదే వేగాన్ని కొనసాగిస్తాయి. ఇదే సమయంలో, అవి ప్రమాదానికి గురికాకుండా అడుగుభాగంలో అయిస్కాంత శక్తిని ఉపయోగిస్తారు. అంటే.. ప్రతి క్యాప్సూల్ గాలిలో కొంచెం కూడా కుదుపు లేుకుండా ప్రయాణిస్తుందన్నమాట.

Best Mobiles in India

English summary
Country's first Hyperloop in AP: Amaravati to Vijayawada in 5 minutes. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X