5జీ కన్నా 10 రెట్లు వేగంతో టెరాహెర్జ్ వస్తోంది

ఈ టెక్నాలజీతో ఓ డీవీడీలోని సమాచారాన్ని సెకను కన్నా తక్కువ సమయంలోనే ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

By Hazarath
|

జపాన్‌కు చెందిన రీసెర్చర్లు సరికొత్త అద్బుతాన్ని సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. 5 జీ జనరేషన్ కన్నా 10 రెట్లు ఎక్కువగా డేటా ట్రాన్స్‌ఫర్ సామర్ధ్యాన్ని కలిగుండే టెరాహెర్జ్ ట్రాన్స్ మీటర్ ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతిక టెక్నాలజీ మరో మూడేళ్లలో, అంటే 2020 నాటికి ఈ టీహెచ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీతో ఓ డీవీడీలోని సమాచారాన్ని సెకను కన్నా తక్కువ సమయంలోనే ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

ఫేస్‌బుక్‌లో లైకులు కొడుతున్నారా..?

ఇంటర్నేషనల్ సాలిడ్ స్టేట్ సర్క్యూట్స్ కాన్ఫరెన్స్

ఇంటర్నేషనల్ సాలిడ్ స్టేట్ సర్క్యూట్స్ కాన్ఫరెన్స్

ఆదివారం నాడు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 'ఇంటర్నేషనల్ సాలిడ్ స్టేట్ సర్క్యూట్స్ కాన్ఫరెన్స్' ప్రారంభంకాగా, జపాన్ లోని హిరోషిమా యూనివర్శిటీ ప్రొఫెసర్ మినోరు ఫుజిషిమా ఈ కొత్త సాంకేతికత వివరాలను వెల్లడించారు.

అల్ట్రా హై స్పీడ్ వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థకు

అల్ట్రా హై స్పీడ్ వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థకు

భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అల్ట్రా హై స్పీడ్ వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థకు ఈ టీహెచ్ టెక్నాలజీ ఉపకరిస్తుందని అన్నారు. శాటిలైట్ల నుంచి సమాచారం, మరింత వేగవంతమైన డౌన్ లోడ్లు, ఫ్లయిట్ నెట్ వర్క్, బేస్ స్టేషన్ల మధ్య వైర్ లెస్ లింక్స్ తదితరాలెన్నో దీంతో ప్రభావితమవుతాయని అన్నారు.

సెకనుకు 105 గిగాబైట్ల వేగాన్ని
 

సెకనుకు 105 గిగాబైట్ల వేగాన్ని

తమ పరిశోధనల్లో భాగంగా 290 నుంచి 315 గిగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలో సెకనుకు 105 గిగాబైట్ల వేగాన్ని అందుకున్నామని మినోరు వెల్లడించారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించలేదని, వీటి వాడకంపై 2019లో జరిగే డబ్ల్యూఆర్ సీ (వరల్డ్ రేడియో కమ్యానికేషన్ కాన్ఫరెన్స్)లో చర్చించనున్నామని అన్నారు.

సెకనుకు 100 జీబీ డేటా ట్రాన్స్ ఫర్‌

సెకనుకు 100 జీబీ డేటా ట్రాన్స్ ఫర్‌

ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆధారిత ట్రాన్స్ మిటర్ వ్యవస్థలో తొలిసారిగా సెకనుకు 100 జీబీ డేటా ట్రాన్స్ ఫర్‌ను తాము సాధించామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం డేటా వేగాన్ని మరింతగా పెంచేలా పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు.

ఇకపై టెరాబైట్ల గురించి

ఇకపై టెరాబైట్ల గురించి

ఇప్పటివరకూ మెగాబైట్లు, గిగాబైట్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నామని, ఇకపై టెరాబైట్ల గురించి మాట్లాడే సమయం వచ్చిందని ఆయన అన్నారు. కాగా, ఈ పరిశోధనలకు జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, పానాసోనిక్ కార్పొరేషన్ లు సహకారాన్ని అందిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Data transfer 10 times faster than 5G? With terahertz, it’s possible! read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X