ఫేస్‌బుక్ మాయ: లక్షమంది స్నేహితుల కోసం లక్షల ఖర్చు

Written By:

అంతా ఫేస్‌బుక్ మయం. ఈ జగమంతా ఫేస్‌బుక్ మయం...రాను రాను ఇలా పాడుకోవాల్సి వస్తోంది కదా.. రాను రాను ఏందీ ఇప్పుడే ఈ పాట పాడుకోవాల్సి వస్తోంది. ఫేస్‌బుక్ లో ఎక్ువ మంది ప్రెండ్స్ ఉంటే అదొక ఆనందంలో ఫీలవుతారు కదా. ఎందుకంటే ఎక్కువమంది కామెంట్లు అలాగే లైకులు ఇస్తారు కదా.. సో అలానే నాకు లక్షల మంది స్నేహితులు కావాలని ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. కొత్తగా ట్రైచేశాడు. అదేంటో మీరే చూడండి.

Read more: ఫేస్‌బుక్ ఆఫీసు అద్దాలు పగిలాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ తెరిచేంత వరకు ఒక బాధైతే

ఫేస్‌బుక్ తెరిచేంత వరకు ఒక బాధైతే తెరిచిన తర్వాత మరొక బాధ ఉంటుంది అందరికీ. తనకు ఎవరూ ఫ్రెండ్స్ రావడం లేదే, తనను ఎవరూ ఫ్రెండ్ గా చేర్చుకోవడం లేదే.. తాను పెట్టిన అంశానికి, ఫొటోకు లైక్ లు కొట్టడం లేదే, కామెంట్ లు పెట్టడం లేదే అంటూ మనసులో కొంత ఆందోళన ఉండే ఉంటుంది.

పాకిస్థాన్ లో కరాచీకి చెందిన రెహాన్ అల్లవాలా

ఈ క్రమంలో అసలు ఆ ఖాతాను గాలికొదిలేసేవారు చాలామందే ఉన్నారు. కానీ, పాకిస్థాన్ లో కరాచీకి చెందిన రెహాన్ అల్లవాలా అనే వ్యక్తి మాత్రం అలా కాదు. కాస్త భిన్నంగా ఆలోచించాడు.

తనకు ఫేస్ బుక్ లో లక్షల్లో స్నేహితులు ఉండాలని

ఎలాగైనా తనకు ఫేస్ బుక్ లో లక్షల్లో స్నేహితులు ఉండాలని కోరుకున్నాడు. బాగా ఆలోచించి 'నన్ను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా చేర్చుకోరా' అంటూ రహదారిపక్కనే పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటుచేశాడు.

అందులో తన ఫొటోను, ఫేస్ బుక్ ఖాతా వివరాలను

అందులో తన ఫొటోను, ఫేస్ బుక్ ఖాతా వివరాలను అందులో పెట్టి తనను ఫాలో అవ్వాల్సిందిగా, స్నేహితుడిగా చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు.

అందుకోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇలా హోర్డింగులు

తనకు లక్షల్లో స్నేహితులను పొందాలని ఉందని, అందుకోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇలా హోర్డింగులు పెట్టిస్తున్నానని కావున మీరు దయఉంచి నన్నుయాడ్ చేసుకోండని పిలుపునిస్తున్నారు.

మనోడు పెట్టిన హోర్డింగ్ లను చూసిన చాలామంది

మరి మనోడు పెట్టిన హోర్డింగ్ లను చూసిన చాలామంది ఇదేం పోయే కాలం అని అనుకున్నా మరి కొంతమంది మాత్రం జాలి చూపించి యాడ్ చేసుకునే పనిలో ఉన్నారని సమాచారం.

ఇతను 1 మిలినియం బిజినెస్ పౌండర్ కూడా

ఇతను 1 మిలినియం బిజినెస్ పౌండర్ కూడా . ఇది పాకిస్తాన్ లో ఉంది. ఒక మనోడికి ఇప్పటికే ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. దాదాపు లక్షా అరవై మూడు వేలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.

ఇప్పటికీ 5 వేలకు దగ్గరలో స్నేహితులను

మొత్తానికైతే ఇతగాడు ఇప్పటికీ 5 వేలకు దగ్గరలో స్నేహితులను సంపాదించుకున్నాడు మరి ఇతని ఆశ నెరవేరుతుందో లేదో ముందు ముందు చూడాలి.

మీరు కూడా స్నేహితులను పొందాలనుకుంటే

మరి మీరు కూడా స్నేహితులను పొందాలనుకుంటే ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా ఫన్నీగా ఉంటుందోమో కదా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Do you want more friends and followers on Facebook Here s the hack
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot