రోడ్డు మీదకు గూగుల్ ఉద్యోగులు, భారత ఐటీకి షాక్

Written By:

ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై టెక్ దిగ్గజాలు మండిపడుతున్నాయి. ఏకంగా న్యాయపోరాటానికి దిగాయి. ఇక గూగుల్ ఉద్యోగులు అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను నిరసిస్తూ దాదాపు 2000 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. ఇక ట్రంప్ ఆర్డర్ ను ఛాలెంజ్ చేస్తూ టెక్ దిగ్గజాలు దావా వేసేందుకు రెడీ అయ్యాయి.

వాట్సప్‌లో మరో దిమ్మతిరిగే ఫీచర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెంటనే ఇలా ర్యాలీకి దిగడం

ట్రంప్ ఆదేశాలకు చెంపచెట్టులా 4 మిలియన్ డాలర్ల సంక్షోభ నిధిని వలసదారుల సమస్యల కోసం సమీకరించిన గూగుల్, వెంటనే ఇలా ర్యాలీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశవ్యాప్తంగా ఉన్న గూగుల్ క్యాంపస్లు

గూగుల్ ఉద్యోగులు చేస్తున్న ఈ ర్యాలీకి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న గూగుల్ క్యాంపస్లు మద్దతు పలుకుతున్నాయి. మద్దతిచ్చే వాటిలో మౌంటేన్ వ్యూ, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సియాటిల్ క్యాంపస్లు ఉన్నాయి.

187 మంది గూగుల్ ఉద్యోగులపై

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 187 మంది గూగుల్ ఉద్యోగులపై ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు ప్రభావం చూపనున్నాయి. వారికి సహాయం కోసం కంపెనీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. విచిత్రమేమిటంటే గూగుల్ సీఈఓ పిచాయ్ , గూగుల్ సెర్జీ బిన్ కూడా వలసవాదులే కావడం.

టెక్ దిగ్గజాల చర్చ

ట్రంప్ ఆర్డర్‌ను ఛాలెంజ్ చేస్తూ వేయబోయే దావాకు సపోర్టుగా అమికస్ బ్రీఫ్స్‌ను ఫైల్ చేయడానికి గ్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీలు మంగళవారం ఓ మీటింగ్ నిర్వహించబోతున్నాయి. ఈ మీటింగ్‌లో దావాకు మద్దతుగా సమర్పించబోయే ఈ లీగల్ డాక్యుమెంట్‌పై టెక్ దిగ్గజాలు చర్చించనున్నాయి.

ఇండియన్ ఐటీ కంపెనీలకు షాకులు

ఇక ఇండియన్ ఐటీ కంపెనీలకు షాకులు భారీగానే తగలనున్నాయి. హెచ్-1బీ వీసాదారుల కోసం తీసుకొచ్చిన కొత్త వేతన చట్టం కోసం తీసుకొచ్చిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో హెచ్-1బీ వీసా దారుల కనీసం వేతనం రూ. 60 వేల డాలర్ల నుంచి లక్షా ముఫ్పై వేల డాలర్లకు పెరిగింది.

అంత జీతాలు ఇచ్చి అక్కడికి పంపించడం..

దీంతో కంపెనీలు ఖంగుతింటున్నాయి. అంత జీతాలు ఇచ్చి అక్కడికి పంపించడం ఎలా అంటూ ఇప్పుడు దిగ్గజాలు ఆలోచనలో పడ్డాయి. అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పడు విదేశీయుల గుండెల్లో ప్రకంపనలు రేపుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google employees rally against Trump’s immigration ban read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot