ఫన్నీవే కాని....పరుగులెత్తించేవి

Written By:

మార్కెట్లో ఎన్నో వేల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. డేటింగ్ యాప్స్ నుంచి నిత్యావసరాలు సినిమా టికెట్ల బుకింగ్ నుంచి సామాజిక మాధ్యమాల వరకూ మునివేలి కొనల తాకిడితో చేతుల్లోకి వాలిపోతున్నాయి. కాని ఈ యాప్స్ మిమ్మల్ని పరుగులు పెట్టిస్తాయి. అలాగే మీ పిల్లల ఏడుపును పసిగడతాయి. ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే చెప్పేస్తాయి. అయితే వేల కొద్ది యాప్స్ లో ఉపయోగపడుతూనే ఆహ్లాదాన్ని కలిగించే యాప్స్ ఎంచుకోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లో కొన్ని ఫన్నీ యూజ్ పుల్ యాప్స్ దూసుకెళ్తున్నాయి. వాటిని ఓ సారి చూద్దాం.

Read more: గూగుల్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రన్ పీ

ఇదో ఆసక్తికరమైన యాప్.ఇది మీరు ఓ సినిమాను చూసేటప్పుడు మూత్ర విసర్జనకు ఎప్పుడు వెళ్లాలన్న విషయాన్ని కచ్చితంగా చెబుతుందట. ఆ చిత్రంలో బోర్ కొట్టే ఒకటి నాలుగు నుంచి సన్నివేశాలను ఎంపిక చేసి అవి వచ్చే సమయానికి అలర్ట్ చేస్తుంది. ఇక ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చినా మిస్ అయిన భాగాన్ని చూపుతుంది. ఒకవేళ సినిమా ప్రారంభం మిస్ అయితే సినాప్సిస్ ఇస్తుంది. ఈ యాప్ లో తాజాగా విడుదలయ్యేపాత సినిమాల సమాచారం మొత్తం నిక్షిప్తం చేసినట్లు యాప్ తయారీదారులు చెబుతున్నారు.

హానీ ఇట్స్

మీ బ్రహ్మచారుల్లో ఈ యాప్ హాట్ సెలక్షన్ గర్ల్ ఫ్రెండ్ లేని వారి స్మార్ట్ ఫోన్లలో తెగ చక్కర్లు కొడుతోంది. సౌత్ కొరియాకు చెందిన నాబిక్స్ తయారు చేసిన యాప్ లో వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ పలకరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మినా అనే పేరున్న ఈ అందమైన యువతితో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ప్రేమ చూపించొచ్చు. ఇంకేమైనా అడగొచ్చు. మీతో మాట్లాడుతూ ఛాటింగ్ చేస్తోంది మినా

హోల్డ్ ఆన్

మీ కాన్సట్రేషన్ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి ఉపయోగపడే యాప్ ఇది. ఇది ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పరీక్షిస్తూ మీ పర్సనల్ రికార్డు సమయాన్ని స్టోర్ చేస్తుంది.

క్రై ట్రాన్స్ లేటర్

వేలాది మంది తల్లిదండ్రులకు ఉపయోగపడే యాప్ ఇది. మీ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో,చిన్నారికి ఏం కావాలో చెప్పేస్తుందట. ఏడుపులో రకాలను బట్టి అనలైజ్ చేసి సొల్యూషన్ ను సిపార్సు చేస్తుంది. వాడికి ఆకలిగా ఉందా..నిద్ర వస్తుందా..బాధ కలిగిందా...ఒత్తిడిలో ఉన్నాడా ఏమీ తోచక ఏడుస్తున్నాడా అన్నది టక్కున చెప్పే యాప్ అందరికీ ఏదో ఒక ధశలో ఉపయోగపడుతుందేమో

ఎయిర్ పీపెన్సీ

మీరు ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా సరే మీకు దగ్గర్లో ఉన్న రెస్ట్ రూం ను ఈ యాప్ చూపిస్తుంటుంది. నగరం మధ్యలో ఉన్నా ఎడారిలో ఉన్నా ఓ పెద్ద ఈవెంట్ లో ఉన్నా మీకు అత్యవసరాలు తీర్చుకోవాల్సిన వేళ ఎటు వెళితే దగ్గర్లో టాయ్ లెట్ ,బాత్ రూం తదితరాలు ఉన్నాయో ఇట్టే చెప్పేస్తుంది. కొత్త నగరాలకు వెళ్లే వారికి ఈ యాప్ భలే ఉపయోగపడుతుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Five really strange, funny yet useful apps that you might be interested in
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot