తెలంగాణాలో ఇంటెక్స్ ప్లాంటు, అనేకమందికి ఉపాధి

Written By:

తయారీ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఇంటెక్స్ తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై కంపెనీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో తొలి విడత చర్చలు జరిపింది. ప్రతిపాదిత ప్లాంటుకు రూ .500 కోట్ల దాకా పెట్టుబడి అవసరం అవుతుందని ఇంటెక్స్ కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ-యాక్సెసరీస్ బిజినెస్ హెడ్ నిధి మార్కండేయ్ తెలిపారు.

ప్రపంచాన్ని మార్చిన టెక్నాలజీ ఇదే !

తెలంగాణాలో ఇంటెక్స్ ప్లాంటు, అనేకమందికి ఉపాధి

తొలుత మొబైళ్లు, ఎల్ఈడీ టీవీలను ఈ ప్లాంటులో తయారు చేస్తారు. ఆ తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఇతర ఉత్పత్తులను దశలవారీగా జోడిస్తారు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కంపెనీ 6 వ ప్లాంటు సైతం ఉత్తరాదికే పరిమితమైంది.

జియోకి పోటీగా ఎయిర్‌టెల్ మళ్లీ దుమ్మురేపింది

తెలంగాణాలో ఇంటెక్స్ ప్లాంటు, అనేకమందికి ఉపాధి

హైదరాబాద్ ప్లాంటు నుంచే దక్షిణాది రాష్ట్రాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తారు. ప్లాంటు ఏర్పాటైతే 600 మందికిపైగా ఉపాధి లభిస్తుందని ఆమె తెలిపారు. అలాగే పరోక్షంగా వేలమంది ఉపాధి పొందుతారని తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Intex to expand consumer durables portfolio Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot