2BHK నుంచి 8.3 లక్షల చదరపు అడుగుల దాకా, ఫ్లిప్‌కార్ట్ జర్నీపై స్పెషల్ ఫోకస్

అమెరికాకు చెందిన ప్రఖ్యాత రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌ భారత ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య డీల్‌ ఓకే అయ్యిందని జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ధ్రువీకరించింది.

|

అమెరికాకు చెందిన ప్రఖ్యాత రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌ భారత ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య డీల్‌ ఓకే అయ్యిందని జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ధ్రువీకరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంకు అందులోని తమ వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లోని తమ 20శాతం వాటాను వాల్‌మార్ట్‌కు అమ్ముతున్నట్లు సాఫ్ట్‌బ్యాంకు సీఈఓ మసయోషి సన్‌ వెల్లడించారు. దీని విలువ 4బిలియన్‌ డాలర్లు ఉంటుంది. కాగా సాఫ్ట్‌బ్యాంకు ఈ షేర్లను గతంలో 2.5బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. మెగా డీల్‌ ఖరారు కావడంతో, ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ జర్నీఎలా సాగింది అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్ సేల్, ఈ రెండు ఫోన్లపైన ఖచ్చితమైన తగ్గింపుఫ్లిప్‌కార్ట్ సేల్, ఈ రెండు ఫోన్లపైన ఖచ్చితమైన తగ్గింపు

పాయింట్ 1

పాయింట్ 1

వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ స్థానం ఉండాలని కలలు కన్న ఇద్దరు వ్యక్తుల ఆశల వారధే ఈ ఫ్లిప్‌కార్ట్‌. ఇద్దరు ఐఐటీ-ఢిల్లీ గ్రాడ్యుయేట్లు అమెజాన్‌లో తమకున్న ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లిప్‌కార్ట్‌ అనే మహ ఈ కామర్స్ సామ్రాజ్యానికి పునాదులు వేశారు.

పాయింట్ 2

పాయింట్ 2

సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 2007లో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో రెండు బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. ఆ ఇద్దరే ఛండీఘర్‌కు చెందిన బిన్నీ బన్సాల్‌, సచిన్‌ బన్సాల్‌లు. ఐఐటీ-ఢిల్లీలో చదువుకునే రోజుల నుంచి ఏర్పడిన పరిచయం అమెజాన్‌లో చేరిన తర్వాత స్నేహ రూపం దాల్చింది.

 పాయింట్ 3

పాయింట్ 3

2008లో బెంగళూరుతో తమ తొలి ఆఫీసును ప్రారంభించి అనంతరం, ఢిల్లీ, ముంబైలలో కూడా 2009లో ఫ్లిప్‌కార్ట్‌ ఆఫీసులను ఏర్పాటు చేశారు. టూ-బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. ఇటీవలే బెంగళూరులో ఓ పెద్ద క్యాంపస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. బెంగళూరులో ఉన్న ఆఫీసులన్నింటిన్నీ ఒకే గూటికి కిందకి అంటే ఆ క్యాంపస్‌లోకి తరలించింది.

పాయింట్ 4

పాయింట్ 4

2011లో ఫ్లిప్ కార్ట్ సింగపూర్ లో స్థిరనివాసాన్ని ఏర్పరచుకుంది. విదేశీ ఇన్వెస్టర్లను అకర్షించుకోవాలనే వ్యూహంలో భాగంగా సింగపూర్ లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. అందులో కొంతమేర విజయం సాధించింది కూడా.

పాయింట్ 5

పాయింట్ 5

ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించినప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు ఫ్లిప్‌కార్ట్‌ సీఈవోగా సచిన్‌ బన్సాల్‌నే ఉన్నారు. అయితే సచిన్‌ బన్సాల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టడంతో 2016లో తొలిసారి సచిన్‌ బన్సాల్‌ నుంచి బిన్నీ బన్సాల్‌ సీఈవో పదవిని అలంకరించారు.

పాయింట్ 6

పాయింట్ 6

గతేడాది ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో పదవిని కల్యాణ్‌ కృష్ణమూర్తికి అప్పజెప్పారు. ప్రస్తుతం బిన్నీ బన్సాల్‌ మొత్తం గ్రూప్‌కు సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌లో ఫ్యాషన్‌ పోర్టల్స్‌ మింత్రా జబాంగ్‌, పేమెంట్స్‌ యూనిట్‌ ఫోన్‌పే, లాజిస్టిక్‌ ఆర్మ్‌ ఈకార్ట్‌లు ఉన్నాయి.

 పాయింట్ 7

పాయింట్ 7

2014లో ఫ్లిప్‌కార్ట్‌, ఆన్‌లైన్‌ అప్పీరల్‌ రిటైలర్‌ మింత్రాను 300 మిలియన్‌ డాలర్లకు తన సొంతం చేసుకుంది. అనంతరం జబాంగ్‌ను 2016లో 70 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫోన్‌పేను 2016లోనే తన సొంతం చేసుకుంది.

 పాయింట్ 8

పాయింట్ 8

వాల్‌మార్ట్‌ సొంతం చేసుకోక ముందు ఫ్లిప్‌కార్ట్‌ అతిపెద్ద పెట్టుబడిదారుగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ఉండేది. 23-24 శాతం వాటాను కలిగి ఉంది. కానీ వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడంతో, పూర్తిగా ఆ కంపెనీ నుంచి సాఫ్ట్‌బ్యాంక్‌ వైదొలుగుతోంది. ఇంటర్నెట్‌ దిగ్గజం నాస్సర్స్‌ కూడా 13 శాతం వాటాను కలిగి ఉండేది. ఇది కూడా తన వాటాను విక్రయించేస్తోంది.

పాయింట్ 9

పాయింట్ 9

ఇతర పెట్టుబడిదారులు న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్‌ ఫండ్‌ టైగర్‌ గ్లోబల్‌, అమెరికా ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అస్సెల్‌ పార్టనర్స్‌, చైనాకు చెందిన టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఈబే ఇంక్‌, మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్లు, నాస్పెర్స్‌, యాక్సెల్‌ కంపెనీలు ఉన్నాయి. ఇవి కంటిన్యూ అవుతాయి.

పాయింట్ 10

పాయింట్ 10

వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య డీల్‌ విలువ దాదాపు 18 నుంచి 20 మిలియన్‌ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ దాదాపు 70శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌లో వాల్‌మార్ట్‌తో పాటు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ కూడా ఉంది. ఆల్ఫాబెట్ దాదాపు 15శాతం వాటా కొనుగోలు చేయనుంది.

పాయింట్ 11

పాయింట్ 11

సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌లకు చెరో 5శాతం వాటా మాత్రమే ఉన్నట్లు సమాచారం. కాగా వాల్ మార్ట్ రాకతో ఈ కామర్స్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతున్న అమెజాన్ కు క్లిష్ట పరిస్థితులు ఎదురుకానున్నాయి. మరి ఈ పరిస్థితిని అమెజాన్ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

Best Mobiles in India

English summary
Walmart Takes Control of India’s Flipkart in E-Commerce Gamble More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X