రూ.14కే అన్‌లిమిటెడ్ 3జీ డేటా

Written By:

ఉచిత ఆఫర్లతో టెల్కోలకు చుక్కలు చూపిస్తున్న జియోకు గట్టి పోటీనిచ్చేందుకు టెల్కోలు ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టెల్కోలు వన్ అవర్ అన్ లిమిటెడ్ డేటా ప్యాక్ లను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే వొడాఫోన్ రూ. 16కే గంటపాటు అన్ లిమిటెడ్ 3జీ డేటాను ప్రకటించింది. ఇప్పుడు దాన్ని కన్నా రెండు రూపాయల తక్కువకే ఐడియా అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది.

గెలాక్సీ నోట్ 7 పేలిపోవడానికి కారణం ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 14తో రీచార్జ్ చేసుకుని గంటసేపు అపరిమిత ఇంటర్నెట్

రూ. 16కు వొడాఫోన్ గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ను ప్రకటించగా, దానికన్నా రెండు రూపాయల తక్కువకే ఐడియా సరికొత్త ప్యాక్ ను ఆఫర్ చేస్తోంది. రూ. 14తో రీచార్జ్ చేసుకుని గంట సేపు అపరిమిత ఇంటర్నెట్ ను వాడుకోవచ్చని తెలిపింది.

జనవరి 19 నుంచి అందుబాటులోకి

ఈ ఆఫర్ జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇదే మాదిరిగా ఇతర టెలికం కంపెనీలు కూడా ఒక గంట ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.

ఐడియా ఆఫర్లు

ఐడియా ఇప్పటికే 10 జిబి 4జి, 3జి ఇంటర్నెట్ ప్యాక్స్ ను కేవలం 990 రూయాయలకే అందిస్తోంది. అలాగే ఇంతకు ముందు 449 రూపాయలుండే 2జిబి డేటాను 349 రూపాయలకు అందిస్తోంది.

ఆఫ్‌లైన్‌లో కూడా సినిమాలను, వీడియోలను డౌన్‌లోడ్

ఐడియా వినియోగదారులు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా సినిమాలను, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ప్రస్తుతం బీటా వెర్షన్‌లో

అయితే ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Get Unlimited 3G Internet For 1 Hour In Idea At Only Rs. 14 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot