గెలాక్సీ నోట్ 7 పేలిపోవడానికి కారణం ఇదే !

Written By:

శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 7 కంపెనీకి భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. బ్యాటరీ పేళుళ్లతో కంపెనీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారిపోయింది. రీ కాల్ చేసి కొత్త ఫోన్లు తెచ్చినా బ్యాటరీ పేళుళ్ల సమస్య మాత్రం కంపెనీని వేధిస్తూనే ఉన్నది. ఇక చేసేది లేక కంపెనీ గెలాక్సీ నోట్ 7 అమ్మకాలు , ఉత్పత్తి నిలిపివేసి కారణాలు శోధించడం మొదలు పెట్టింది, ఎట్టకేలకు కారణాలను కనుగొన్నట్లు తెలిసింది.

మంటతో ఫోన్ ఛార్జింగ్, వంట కూడా చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాటరీల పరిమాణం సరిగ్గా లేదని

గెలాక్సీ నోట్7 ఫోన్లకు సరిపడ పరిమాణంలో లేని బ్యాటరీలను ఫిక్స్ చేయడం వల్లనే అవి ఓవర్‌హీట్ అయి పేలుతున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం రిపోర్టు చేసింది. కంపెనీకి సమస్య తీసుకొచ్చిన బ్యాటరీల పరిమాణం సరిగ్గా లేదని, దీనివల్ల అవి ఓవర్‌హీట్ అవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

శాంసంగ్ కనుగొన్న కారణాన్ని..

సోమవారం రోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ కొరియా దిగ్గజం ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కనుగొన్న కారణాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించేసింది.

తమ తప్పేమి లేదంటూ..

పేలుళ్ల బ్యాటరీలను కంపెనీకి బ్యాటరీల సప్లయర్‌గా ఉన్న ఓ సంస్థ సరఫరా చేస్తుందని శాంసంగ్ చెబుతోంది. తమ తప్పేమి లేదంటూ వాదిస్తోంది. కానీ ఆ సప్లయర్ పేరును మాత్రం శాంసంగ్ వెల్లడించడం లేదు.

శాంసంగ్ ఎస్‌డీఐ

అయితే ఆ కంపెనీ ఈ దక్షిణ కొరియా దిగ్గజానికి చెందినదేనని, శాంసంగ్ ఎస్‌డీఐగా పలువురు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ శాంసంగ్‌కు అవసరమైన బ్యాటరీలను రూపొందిస్తోంది.

క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్‌

సంస్థకు చెందిన మొత్తం ఉత్పత్తిని పూర్తిగా సంస్కరిస్తుందని, మరో సమస్య తలెత్తకుండా క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్‌ను సంస్కరించనున్నామని శాంసంగ్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung probe finds faulty batteries triggered Galaxy Note 7 fires: Report read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot