గూగుల్‌కి పంచ్ పడింది

Written By:

గూగుల్‌కి పంచ్ పడింది..ఏందీ నమ్మలేకున్నారా...ఇది నిజం గూగుల్ పై ఇప్పుడు ఇతర దేశాల్లో ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. భారత్ లో సైతం గూగుల్ పై అనేక సంస్థలు ఫిర్యాదులతో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. పలు కంపెనీల విషయాలను గూగుల్ తక్కువ చేసి చూపుతుందంటూ అనేక ఖండాల్లో పలు కంపెనీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల తమ కంపెనీల ప్రతిష్ట దెబ్బ తింటోందని వారు మండి పడుతున్నారు.

Read more:గూగుల్ లోగో మారిందోచ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా,యూరప్ ఖండాలలో ఫిర్యాదులు

గూగుల్ సంస్థ తమ కంపెనీల విషయాలను తక్కువ చేసి చూపుతోందని అమెరికా,యూరప్ ఖండాలలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి.

సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు

అదే విధంగా భారత్ లో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయని పలు కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేఫథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం ఆ సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడంతో పాటు వివరణ కోరింది.

కంపెనీలు మధ్య నెలకొన్న పోటీ వల్లనే ఈ సమస్యలు

కంపెనీలు మధ్య నెలకొన్న పోటీ వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. కంపెనీల ఆర్థిక లావాదేవీలు,ఆన్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్ వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుగా చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతర కంపెనీల మార్కెట్లకు దెబ్బ

బ్రెజిల్ మెక్సికోలలో సొంత కంపెనీల సేవలను ఎక్కువ చూపిస్తూ ఇతర కంపెనీల మార్కెట్లను దెబ్బతీస్తుందని స్థానిక వ్యాపార వేత్తలు భావిస్తున్నారు.

ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు

ఇదే తరహా భారత వెబ్ సైట్ మాట్రిమోని,కన్జ్యూమర్ అండ్ ట్రస్ట్ సొసైటీలు కాడా అవాస్తవాలను ప్రచారం చేయడంతో తమ వెబ్ సైట్ల సేవలు మందగించాయని ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆ కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

సెప్టెంబర్ 10లోపు దీనిపై వివరణ

సెప్టెంబర్ 10లోపు దీనిపై వివరణ ఇచ్చుకోవాలని కాంపీటీషన్ కమిషన్ ఆప్ ఇండియా,గూగుల్ సంస్థ నిర్వాహకులకు సూచించగా వారు గడువు మరింత పొడిగించాలని కోరుతున్నారు.

గూగుల్ కి ఇండియా అతి పెద్ద మార్కెట్

చైనాలో గూగుల్ షట్ డౌన్ కావడంతో ఫేస్ బుక్ అలాగే గూగుల్ కి ఇండియా అతి పెద్ద మార్కెట్ గా అవతరించిందిఅలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇండియా వారు కావడంతో ఆండ్రాయిడ్ వన్ అలాగే స్మార్ట్ పోన్ లనే 50 డాలర్లుకన్నా తక్కువ లో తీసుకురావడానికి ఇండియాని వేదికగా మలుచుకుంటోంది.

మార్కెట్ ను విస్తరించుకునేందుకు పోటీ

గూగుల్ ఇండియాలో కంపెనీకి సంబంధించిన బ్రింగ్ ,మైక్రోసాప్ట్, ప్రొడక్ట్ సర్వీసుల మార్కెట్ ను విస్తరించుకునేందుకు పోటీ పడుతోంది. అయితే మాపై వచ్చిన కంప్లయిట్ పై సీసీఐ విచారణ సాగుతుందని అయితే మాకు ఇండియా చట్టాలపైనమ్మకముందని గూగుల్ కి చెందిన ఓ మహిళా ఉద్యోగి స్టేట్ మెంట్ తో కూడిన ఈ మెయిల్ ను పంపినట్లు తెలుస్తోంది.

యునైటైడ్ స్టేట్స్ కు ఇండియా ప్రధాని నరేంద్రమోడీ

ఈ పనిలో భాగంగానే యునైటైడ్ స్టేట్స్ కు ఇండియా ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల చివరిలో వెళ్లనున్నారు.అలాగే అక్కడ గూగుల్ క్యాంపస్ ను కూడా సందర్శించే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Google Antitrust Inquiries Spread Over Globe, With India the Latest Problem
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot