Google Photos లో ఉచిత అపరిమిత స్టోరేజ్ ఇక కుదరదు!!! ఎప్పటి నుంచో తెలుసా

|

ప్రపంచం మొత్తం స్మార్ట్ రంగంవైపు వేగంగా అభివృద్ధిని సాదిస్తున్నది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ యొక్క జ్ఞాపకాలు ఫోటోలు మరియు వీడియోలను భద్రపరచడానికి గూగుల్ ఫోటోలపై ఆధారపడుతున్నారు. గూగుల్ ఫోటోలలో 4 ట్రిలియన్లకు పైగా ఫోటోలు స్టోర్ చేయబడి ఉన్నాయని గూగుల్ సంస్థ ఇటీవల ప్రకటించింది. అంతే కాకుండా ప్రతి వారం సుమారు 28 బిలియన్ల కొత్త ఫోటోలు మరియు వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి అని సంస్థ తెలిపింది. అయితే గూగుల్ ఫోటోలలో అపరిమిత మరియు అధిక నాణ్యత స్టోరేజ్ విధానాన్ని మారుస్తున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. గూగుల్ ఫోటోలలో యూజర్లు ప్రతి గూగుల్ అకౌంటుతో జూన్ 1, 2021 నుండి ఏవైనా క్రొత్త ఫోటోలు మరియు వీడియోలను కేవలం 15GB వరకు మాత్రమే అప్‌లోడ్ చేయగలరని కంపెనీ ప్రకటించింది.

గూగుల్ ఫొటోస్ అధికారిక బ్లాగ్ పోస్ట్‌ సమాచారం

గూగుల్ ఫొటోస్ అధికారిక బ్లాగ్ పోస్ట్‌ సమాచారం

"గూగుల్ ఫోటోలలో స్టోరేజ్ కోసం రోజురోజుకి పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా అపరిమిత స్టోరేజ్ విధానంలో మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే ఎప్పటిలాగే ప్రకటనల ప్రయోజనాల కోసం గూగుల్ ఫోటోలలో సమాచారాన్ని ఉపయోగించకూడదనే మా నిబద్ధతను మేము సమర్థిస్తాము. ఇది పెద్ద మార్పు అని మాకు తెలుసు మరియు ఆశ్చర్యం కలిగించవచ్చు కాబట్టి మీకు ముందుగానే తెలియజేయాలని మరియు దీన్ని సులభతరం చేయడానికి వనరులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. " అని గూగుల్ సంస్థ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

Also Read: WhatsApp Payments: వాట్సాప్ పే ద్వారా పేమెంట్స్ చేయడం ఎలా?Also Read: WhatsApp Payments: వాట్సాప్ పే ద్వారా పేమెంట్స్ చేయడం ఎలా?

గూగుల్ ఫొటోస్ అపరిమిత స్టోరేజ్ మార్పు

గూగుల్ ఫొటోస్ అపరిమిత స్టోరేజ్ మార్పు

గూగుల్ ఫోటోలలో పరిమిత స్టోరేజ్ విధానాన్ని తీసుకురావడం కొంతమందిని నిరాశపరిచినప్పటికీ ఇందులో శుభవార్త ఏమిటంటే జూన్ 1, 2021 కి ముందు మీ ఫోటోలు లేదా వీడియోలు అధిక నాణ్యతతో అప్‌లోడ్ చేయబడినవి 15GB ఉచిత స్టోరేజ్ కింద లెక్కించబడవు. మరి సరళంగా చెప్పాలంటే జూన్ 1, 2021 కి ముందు బ్యాకప్ చేసిన అన్ని ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికీ ఉచితంగా పరిగణించబడతాయి మరియు స్టోరేజ్ పరిమితి నుండి మినహాయించబడతాయి.

గూగుల్ ఫొటోస్ బ్యాకప్

గూగుల్ ఫొటోస్ బ్యాకప్

గూగుల్ ఫోటోలలో మీరు మీ ఫోటోలు మరియు వీడియోలను అసలైన నాణ్యతతో బ్యాకప్ చేస్తే కనుక ఈ కొత్త మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేయవు. అదనంగా మీరు పిక్సెల్ 1, పిక్సెల్ 2, పిక్సెల్ 3, పిక్సెల్ 4 మరియు పిక్సెల్ 5 వంటి వాటిలో దేనినైనా ఉపయోగిస్తూ ఉంటే కనుక వాటి నుండి అప్‌లోడ్ చేయబడిన ఫోటోలు ఈ పరిమిత స్టోరేజ్ కు ప్రభావితం కావు. జూన్ 1, 2021 తర్వాత కూడా ఈ ఫోన్ల నుండి అధిక నాణ్యతతో అప్‌లోడ్ చేయబడిన ఫోటోలు మరియు వీడియోలు ఈ మార్పు నుండి మినహాయించబడతాయని గూగుల్ ధృవీకరించింది.

గూగుల్ ఫొటోస్ 15GB స్టోరేజ్ పరిమితి

గూగుల్ ఫొటోస్ 15GB స్టోరేజ్ పరిమితి

గూగుల్ ఫోటోలలో కొత్తగా తీసుకురాబోతున్న ఈ మార్పుకు సర్దుబాటు చేయడానికి కంపెనీ వినియోగదారులకు ఇంకా కొంత సమయం ఇస్తోంది. ఈ మార్పు మరో ఆరు నెలల తరువాత అమలులోకి రానున్నది కాబట్టి మీకు ప్రస్తుతానికి చాలానే సమయం ఉంది. ఈ మార్పు జూన్ 1, 2021 నుండి అమలులోకి వచ్చిన తర్వాత మీలో 80 శాతానికి పైగా ఉచిత 15GB స్టోరేజ్ తో సుమారు మూడు సంవత్సరాల విలువైన జ్ఞాపకాలను ఎప్పటికీ నిల్వ చేసుకోవచ్చు అని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. మీ స్టోరేజ్ 15GB కి చేరువలో ఉన్నప్పుడు Google ఇమెయిల్ ద్వారా తెలియజేస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Google Photos Free Unlimited Storage Ends From June 1, 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X