ఇకపై పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ (పాస్‌పోర్టుకి అప్లయి చేయడం ఎలా ?)

By Hazarath
|

ఇకపై పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్‌ ఆధారిత ఈ-పాస్‌పోర్టులను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ-పాస్‌పోర్టులను తీసుకొచ్చేందుకు సన్నాహాలను ప్రారంభించామని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో చెప్పారు.

జియోపై ఊక్లా దాడి , స్పీడ్‌లో ఎయిర్‌టెల్ బెస్ట్

ఇకపై పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్

 

దీనికోసం ప్రపంచవ్యాప్తంగా టెండర్లను పిలిచే బాధ్యతను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కు అప్పగించినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు, డిజిటల్ సంతకం చిప్‌లో ఉంటాయని వెల్లడించారు. అతి త్వరలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు.

ఈ మిస్టేక్స్ మీ ఆఫీస్ కంప్యూటర్‌లో చేస్తున్నారా..?

పాస్‌పోర్టుకు అప్లయి చేయడం ఎలాగో ఓ సారి చూద్దాం.

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి. పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌ హోమ్ పేజీలోని Apply సెక్షన్‌‌‌లో కనిపించే రిజిష్టర్ (Register) లింక్ పై క్లిక్ చేయటం ద్వారా రిజిష్ట్రేషన్ ప్రకియను ప్రారంభించవచ్చు

స్టెప్ 2

స్టెప్ 2

రిజిస్ట్ర్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఆ తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

స్టెప్ 4
 

స్టెప్ 4

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌ను పొందేందుకు "Pay and Schedule Appointment" అనే లింక్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5

స్టెప్ 5

బుకింగ్ అపాయింట్‌మెంట్‌‌లకు ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి మీ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబందించి ఆన్‌లైన్ చెల్లింపును క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేపట్టిండి.

స్టెప్ 6

స్టెప్ 6

మీ దరఖాస్తుకు సంబంధించి ఆన్ లైన్ చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిన తరువాత "Print Application Receipt" లింక్ పై క్లిక్ చేయండి. మీరు పొందే ఈ రిసిప్ట్‌లో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ పొందుపరచబడి ఉంటుంది.

స్టెప్ 7

స్టెప్ 7

పొందిన అప్లికేషన్ రిసిప్ట్‌‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్‌లను తీసుకుని అపాయింట్‌మెంట్ బుక్ కాబడిన సమాయానికి సంబంధింత పాస్‌పోర్ట్ సేవ కేంద్రానికి హాజరు కావటం వల్ల ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Government of India has started the process to roll out chip-based passports read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X